హృతిక్‌రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘వార్-2’ ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్‌రాజ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ నెల 25న ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ తేదీకి ఎంతో ప్రత్యేకత ఉందని..ఎన్టీఆర్, హృతిక్‌రోషన్ ఈ ఏడాదితో సినీరంగంలో 25ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారని, ఈ అరుదైన క్షణాలను మరింత గొప్పగా సెలబ్రేట్ చేసుకోవడానికి 25న ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతున్నామని మేకర్స్ తెలిపారు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న ఈ చిత్రంలో కియారా అద్వాణీ కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మాజీ ‘రా’ గూఢచారి పాత్రలో కనిపించనున్నారు. టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ట్రైలర్ గురించి ఇద్దరి హీరోల అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.