Toxic Movie | కన్నడ యష్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. కేజీఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ల తర్వాత యష్ సినిమా ఎప్పుడు మొదలవుతుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇక అభిమానుల అంచనాలను అందుకునేలా తన కొత్త చిత్రం ప్రారంభించాడు యష్. యశ్ (Yash) హీరోగా నేషనల్ అవార్డు విన్నర్ మలయాళ దర్శకురాలు గీతూమోహన్ దాస్ ‘టాక్సిక్’ (Toxic) అనే తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. గతేడాది ప్రకటించిన ఈ చిత్రం ఇప్పటివరకు పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటూ వస్తుంది. అయితే రీసెంట్గా ఈ సినిమా ఆగష్టు 08న షూట్ మొదలుపెట్టబోతున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది.
చెప్పినట్లుగానే నేడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు తెలుపుతూ కేజీఎఫ్ హీరో ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు ఎక్స్‌లో సందడి చేస్తున్నాయి. యశ్ నటిస్తోన్న 19వ చిత్రమే ‘టాక్సిక్’. ‘ఎ ఫెయిరీ టెల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాను శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది రానుంది. అయితే అదే రోజు ప్రభాస్ నటిస్తున్న ‘రాజాసాబ్’ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద క్లాష్ అయ్యే అవకాశం ఉంది. ఇక టాక్సీక్ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది.
A new chapter begins for a tale to witness 🔥#ToxicShootBegins today with an auspicious pooja ceremony 🪔
Here are some magical moments 📸@TheNameIsYash #TOXICTheMovie #GeetuMohandas @KVNProductions@Toxic_themovie pic.twitter.com/buKK1cLMNA
— KVN Productions (@KvnProductions) August 8, 2024
మరోవైపు ఈ సినిమా స్టార్ట్ అయ్యే ముందు కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించారు యష్. తమ కుటుంబసభ్యులతో కలిసి శ్రీసదాశివ రుద్ర సూర్య ఆలయం, ధర్మస్థలి శ్రీమంజునాథేశ్వర ఆలయం, సుబ్రమణ్యలోని కుక్కే సుబ్రమణ్య ఆలయం.. ఇలా కర్ణాటకలోని ఆలయాలను సందర్శించి మొక్కులు తీర్చుకున్నాడు. కొత్త సినిమా మొదలుపెట్టేముందు ఆలయ సందర్శన యష్ అలవాటని సమాచారం. అలాగే.. యష్ లక్కీ నంబర్ 8 కావడంతో 8-8-8 అనే నంబర్ వచ్చే రోజున యష్ తన కొత్త సినిమాలను మొదలుపెట్టడం మొదట్నుంచీ రివాజు.