Nadikar Movie | మిన్నల్ మురళీ (Minnal Murali), 2018, తల్లుమల్ల సినిమాలతో తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించాడు మలయాళ నటుడు టోవినో థామస్ (Tovino Thomas). ఇదిలా ఉంటే.. టోవినో థామస్ నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘నడిగర్’ (Nadigar). ఈ సినిమాకు ‘డ్రైవింగ్ లైసెన్స్’ ఫేమ్ జీన్ పాల్ లాల్(Jean Paul Lal) దర్శకత్వం వహిస్తుండగా.. సౌబిన్ షాహిర్(Shoubin Shaeer) కథనాయికగా నటిస్తుంది. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్రబృందం తాజాగా టీజర్ విడుదల చేసింది.
ఈ టీజర్ గమనిస్తే.. టోవినో థామస్ ఈ చిత్రంలో స్టార్ నటుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. సూపర్ స్టార్ డేవిడ్ పడిక్కల్ పాత్రలో అలరించనున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2024 మే 03న మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
మరోవైపు రీసెంట్గా ఈ సినిమాపై తమిళ నటుడు శివాజీ గణేషన్ అభిమానుల సంఘం కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్ని మార్చాలని చిత్ర బృందాన్ని డిమాండ్ చేసింది. తమిళ సినీ నటుడు, నిర్మాత శివాజీ గణేశన్ (Shivaji Ganeshan)ను ‘నడికర్ తిలకం'(Nadigar Thilagam) అని కూడా పిలుస్తారు. అయితే సినిమా టైటిల్ను ‘నడిగర్ తిలకం’ (Nadigar Thilakam) అని పెట్టడం వలన శివాజీ గణేషన్ అభిమానులు టైటిల్ మార్చాలని డిమాండ్ చేశారు. దీంతో చేసేదేమి లేక టైటిల్ నడిగర్ అని ఛేంజ్ చేశారు.