Tourist Family Director | టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు అభిషన్ జీవింత్. శశి కుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రం తమిళంలో రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా తర్వాత అభిషన్ మరో సినిమాను తెరకెక్కిస్తాడు అనుకుంటే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇందుకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. అభిషన్ హీరోగా అరంగేట్రం చేయబోతున్న ఈ సినిమాకు ‘కరెక్టెడ్ మచ్చి’ (Corrected Machi) అనే టైటిల్ పెట్టినట్లు తెలుస్తుంది. ఇందులో మలయాళ నటి అనస్వర రాజన్ హీరోయిన్గా నటించబోతున్నట్లు సమాచారం.
అభిషన్ జీవింత్ “టూరిస్ట్ ఫ్యామిలీ” సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించిన విషయం తెలిసిందే. చేసింది చిన్న పాత్రే అయిన తన నటనతో అందరిని మెప్పించాడు. అయితే ఇప్పుడు పూర్తిస్థాయి నటుడిగా మారుతుండడంతో ఈ ప్రాజెక్ట్‌పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ‘కరెక్టెడ్ మచ్చి’ (Corrected Machi) సినిమాకు టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రానికి కో-డైరెక్టర్‌గా పనిచేసిన అభిషన్ సహచరుడు దర్శకత్వం వహించనున్నారని టాక్. ఈ ప్రాజెక్ట్ ప్రారంభ దశలో ఉందని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. అనస్వర రాజన్ సూపర్ శరణ్య(Super Sharanya), థగ్స్ (Thugs), రేఖచిత్రం, పైంకీలి వంటి చిత్రాలతో గుర్తింపు పొందింది.