ప్రస్తుతం తెలుగులో భారీ సినిమాలతో బిజీగా ఉంది అగ్ర కథానాయిక సమంత. బాలీవుడ్లో కూడా కొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయని తెలుస్తున్నది. ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్‌సిరీస్‌తో హిందీ ప్రేక్షకులకు చేరువైన ఈ భామ తాజాగా మరో సిరీస్‌లో నటిస్తున్నది. అమెరికన్ వెబ్‌సిరీస్ ‘సిటాడెల్’ ఆధారంగా రూపొందిస్తున్న ఈ సిరీస్‌లో వరుణ్‌ధావన్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ‘ది ఫ్యామిలీమ్యాన్-2’ మేకర్స్ రాజ్-డీకే దర్శకత్వం వహిస్తున్నారు.
ఇందు లో సమంత గూఢచారి పాత్రలో కనిపించనుంది. తన పాత్రలో సహజత్వం కోసం అమెరికా వెళ్లి యాక్షన్ ఘట్టాల్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంది సమంత. ఇదిలావుండగా ఈ సినిమా తాలూకు మరో ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది. 1990 నాటి బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ నడుస్తుందని, ఆనాటి కాలమాన పరిస్థితుల్ని కళ్లకు కడుతూ ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుందని చెబుతున్నారు. నవంబర్‌లో ఈ సినిమా వెబ్‌సిరీస్ మొదలుకానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్నది. ప్రస్తుతం సమంత తెలుగులో ‘యశోద’ ‘ఖుషి’ చిత్రాల్లో నటిస్తున్నది.