Tollywood Shootings | రేపటి నుంచి తెలుగు సినిమాల షూటింగ్స్ బంద్..!
24 క్రాప్ట్స్ లో అందరికీ ఇబ్బందులున్నాయని..వాటిని పరిష్కరించే వరకు షూటింగ్స్ నిలిపేస్తున్నామని తెలుగు ఫిలిం చాంబర్ (Telugu Film Chamber) అధ్యక్షుడు బసిరెడ్డి ప్రకటించారు.
రేపటి (ఆగస్టు 1)నుంచి టాలీవుడ్ (Tollywood Shootings)లో షూటింగ్స్ బంద్ కానున్నాయి. 24 క్రాఫ్ట్స్‌లో అందరికీ ఇబ్బందులున్నాయని..వాటిని పరిష్కరించే వరకు షూటింగ్స్ నిలిపేస్తున్నామని తెలుగు ఫిలిం చాంబర్ (Telugu Film Chamber) అధ్యక్షుడు బసిరెడ్డి ప్రకటించారు. ఈ విషయమై చర్చించేందుకు నేడు ఫిలిం చాంబర్ జనరల్ బాడీ మీటింగ్ సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రొడ్యూసర్‌గిల్డ్ నిర్ణయానికి ఫిలించాంబర్ మద్దతు తెలిపింది.
ఈ మేరకు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న తెలుగు సినిమాల (Telugu Cinema) షూటింగ్స్ నిలిపేయాలని ఫిలించాంబర్ నిర్ణయించింది. సమస్యల పరిష్కారానికి కొంత సమయం కావాలి. సినీ పరిశ్రమలో ఉన్న సమస్యలను పరిష్కరించడం కోసం రన్నింగ్‌లో ఉన్న సినిమాల షూటింగ్స్ నిలిపేస్తున్నామని నిర్మాత దిల్ రాజు అన్నారు. పరిష్కారం దొరికే వరకు బంద్ కొనసాగుతుంది. అంతా కలిసి చర్చించుకుంటామని ఆయన వెల్లడించారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న గాడ్ ఫాదర్, చిరు 154, బాలకృష్ణ-గోపీచంద్ మలినేని డైరెక్షన్లో వస్తున్న ఎన్బీకే 107, క్రిష్-పవన్ హరిహరవీరమల్లు, రాంచరణ్-శంకర్ ఆర్సీ 15, వంశీపైడిపల్లి-విజయ్, విజయ్‌దేవరకొండ-శివనిర్వాణ ఖుషి, సమంత నటిస్తోన్న యశోద, అఖిల్ చేస్తోన్న ఏజెంట్ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి.
Read Also : Sita Ramam Ticket Prices | సీతారామం టికెట్ల ధరలు ఫిక్స్..కాన్ఫిడెంట్‌గా మేకర్స్
Read Also : Rajinikanth | మాధవన్‌ను సత్కరించిన రజినీకాంత్..వీడియో వైరల్
Read Also : Bimbisara | ప్రమోషన్స్ లో బిజీ..బింబిసార మేకర్స్ కొత్త అప్డేట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

