Tollywood | ఇటీవల కాలంలో టాలీవుడ్ సహా ఇతర ఇండస్ట్రీలని గమనిస్తే ఓ ప్రత్యేకమైన ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. సినిమా రిలీజ్‌కి ముందే ఒక పాటను విడుదల చేస్తూ, దానిపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఆ పాటలు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సాధిస్తూ, రికార్డులు కొల్లగొడుతున్నాయి. అయితే… సినిమాని థియేటర్లో చూసినపుడు ఆ పాటలు లేకపోవడం ప్రేక్షకుల్లో తీవ్ర నిరాశ కలిగిస్తోంది. ఇలాంటివ ఈ మధ్య అనేక సినిమాల్లో కనిపించాయి. గేమ్ ఛేంజర్ చిత్రం విషయానికి వస్తే రామ్ చరణ్ – కియారా అద్వానీలపై తెరకెక్కించిన “నానా హైరానా” మెలొడీ హిట్ అయ్యింది. కానీ థియేటర్లో ఆ పాటే లేదు.
దేవర విషయానికి వస్తే ఎన్టీఆర్ – జాన్వీ కపూర్‌పై వచ్చిన మాస్ సాంగ్ “దావుదీ” ప్రేక్షకుల్లో హైప్ పెంచింది. కానీ సినిమాలో చూస్తే ఆ పాట మిస్ అయింది. ఇక రీసెంట్గా విడుదలై పెద్ద హిట్ సాధించిన కుబేర చిత్రంలో రష్మికపై వచ్చిన “పిప్పి డుం డుం డుం” గీతాన్ని ట్రెండింగ్‌లోకి తీసుకువచ్చారు. కానీ ఫైనల్ కట్లో దాన్ని తొలగించారు. కింగ్డమ్ చిత్రంలో విజయ్, భాగ్యశ్రీల మధ్య “హృదయం లోపల” అనే లవ్ సాంగ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. కానీ సినిమా ఎడిటింగ్ సమయంలో దాన్ని కూడా తొలగించారు.ఇండియన్ 2లో నీ పాదధూళి మెరుపవుతాను పాట యాక్షన్‌తో మిక్స్ అయిన మెలోడీగా వైరల్ అయింది. కానీ సినిమాకు వెళ్లినవారికి నిరాశ మిగిలింది, ఎందుకంటే పాట కనిపించలేదు!
గతంలో సర్కారు వారి పాట సినిమాలో మురారివా, పెన్నీ సాంగ్స్ సినిమాలో కనిపించలేదు. విరూపాక్షలో కళ్ళలో.. అంటూ సాగిన సాంగ్ కూడాఎడిటింగ్లో లేపేశారు. ఇలా గతంలో కూడా కొన్ని సినిమాల్లో చేసారు. వీటిల్లో రిలీజ్ తర్వాత కొన్ని రోజులకు ఆ పాటను సినిమాలో జత చేస్తే కొందరు మాత్రం అలాగే వదిలేస్తున్నారు. ఈ తరహా మార్పులపై ప్రేక్షకుల్లో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా కోసం హైప్ క్రియేట్ చేసే పాటలు చివరికి ఎందుకు కట్ చేస్తున్నారు?, షూట్ చేసి, ప్రమోట్ చేసిన పాటను సినిమాలో ఎందుకు ఉంచడం లేదు?, మళ్లీ కొన్ని రోజులకు ఆ పాటను జత చేసే బదులు, ముందే పెట్టొచ్చుకదా?, ఇది కేవలం మార్కెటింగ్ స్ట్రాటజీ లా అనిపిస్తోందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే పాటలు సినిమాకు ముఖమైపోతున్న ఈ రోజుల్లో, వాటిని సినిమా నుంచి తొలగించడం మంచి విషయం కాదని చాలామంది భావిస్తున్నారు.