లూసిఫర్ రీమేక్ ఆగిపోయింది.. ఫైనల్ స్క్రిప్ట్ విషయంలో చిరంజీవి అసంతృప్తిగా ఉన్నాడు.. దర్శకుడిగా మోహన్ రాజాను మార్చే పనిలో ఉన్నారు.. ఇలా సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి వార్తలు ఎన్నో వస్తున్నాయి. కానీ దర్శక నిర్మాతలు మాత్రం తాము చేయాల్సిన పని సైలెంట్ గా చేస్తున్నారు. బయట వినిపిస్తున్న రూమర్స్ వాళ్ళు పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఎందుకంటే ఒకవైపు ఇన్ని వార్తలు వినిపిస్తున్నా..మరో వైపు సినిమా కోసం మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు పెట్టారు. లూసిఫర్ తెలుగు రీమేక్ సంగీత బాధ్యతలు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తీసుకున్నాడు.
ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి సినిమాకు సంగీతం అందించలేదు. కాకపోతే సైరా మోషన్ పోస్టర్.. అంతకు ముందు బ్రూస్ లీ సినిమాలో చిరంజీవి ఎంట్రీ కోసం ఒక అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సిద్ధం చేశాడు తమన్. మనోడు ఇప్పుడు సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఇండస్ట్రీలో ఏ హీరో సినిమా అయినా తమన్ సంగీతం లేకుండా ముందుకు వెళ్లడం లేదు అంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు లూసిఫర్ రీమేక్ కోసం కూడా తనదైన శైలిలో స్వరాలు సమకూరుస్తున్నాడు. దర్శకుడు మోహన్ రాజాతో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టాడు.
వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దర్శకుడు మోహన్ రాజా, తమన్ ఇద్దరు కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. చిరు 153 మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి.. సూపర్ హ్యాపీ అంటూ తమన్ ట్వీట్ చేశాడు. ఈ సినిమాను మెగా సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మలయాళంలో సూపర్ హిట్ అయిన మోహన్ లాల్ లూసిఫర్ సినిమా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మార్చి తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
Musical Rampage is On for #Chiru153 🤩
— Vamsi Kaka (@vamsikaka) June 28, 2021
Directed by @jayam_mohanraja 🎬 South India’s Musical Wizard @MusicThaman 🪄 kick starts the Music Sittings for Megastar @KChiruTweets ‘s #Chiru153 🥁
Shoot Begins Soon 🔥@KonidelaPro #MegaSuperGoodFilms #RBChoudary @ProducerNVP pic.twitter.com/Lwbgi6wKFe
ఇవి కూడా చదవండి..
నటుడు ఆర్ నారాయణమూర్తి అరెస్ట్..!
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. కళా దర్శకుడు మృతి
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
Recommended Content by ntnews.com