Shiva Shakti Dutta | నాటు నాటులో సంగీతం ఎక్కడుంది? అసలు అదొక పాటేనా?.. కీరవాణి తండ్రి సెన్సేషల్ కామెంట్స్
Shiva Shakti Dutta | అందర్నీ ఆకట్టుకున్న నాటు నాటు పాట మాత్రం కీరవాణి తండ్రి శివశక్తి దత్తాకు నచ్చలేదట. ఈ పాటలో అసలు సంగీతమెక్కడ ఉంది అంటూ తాజాగా సెన్సేషల్ కామెంట్స్ చేశాడు. శివశక్తి దత్తా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
Shiva Shakti Dutta | ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది. ఈ పాటలోని లిరిక్స్ అర్థం కాకపోయినా విదేశీయులకు తెగ నచ్చేసింది. ఇందులోని మ్యూజిక్ వాళ్లకు పిచ్చెక్కించింది. అందుకే చిన్నా పెద్దా.. సామాన్యులు.. సెలబ్రెటీలు అనే తేడా లేకుండా చాలామంది ఈ సాంగ్‌కు కాళ్లు కదిపారు. నాటు నాటు సాంగ్‌కు వస్తున్న క్రేజ్ చూసి ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు కూడా గేయ రచయిత చంద్రబోస్, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిని వరించింది. ఇంతలా అందర్నీ ఆకట్టుకున్న నాటు నాటు పాట మాత్రం కీరవాణి తండ్రి శివశక్తి దత్తాకు నచ్చలేదట. ఈ పాటలో అసలు సంగీతమెక్కడ ఉంది అంటూ తాజాగా సెన్సేషల్ కామెంట్స్ చేశాడు. శివశక్తి దత్తా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
కీరవాణికి ఆస్కార్ అవార్డు రావడం పట్ల అతని తండ్రి శివశక్తి దత్తా ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఈ సందర్భంగా కీరవాణి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. కీరవాణి తనకు పంచప్రాణాలు అని శివశక్తి దత్తా చెప్పుకొచ్చాడు. మూడో ఏట నుంచే కీరవాణికి సంగీతం నేర్పించానని చెప్పాడు. చిన్నప్పటి నుంచి కీరవాణి టాలెంట్ చూసి ఆశ్చర్యపోతూనే ఉన్నానని తెలిపాడు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ తనకు నచ్చలేదని పేర్కొన్నాడు. అసలు అది ఒక పాటేనా? అందులో సంగీతం ఎక్కడ ఉంది? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కానీ విధి విచిత్రమైనదని.. ఇన్నాళ్లు కీరవాణి పడ్డ కష్టానికి ఆస్కార్ రూపంలో ఫలితం దక్కిందని సంతోషం వ్యక్తం చేశాడు.
చంద్రబోస్ రాసిన 5వేల పాటల్లో ఒదొక పాటనా? కీరవాణి ఇచ్చిన సంగీతంతో పోలిస్తే ఇదొక మ్యూజికేనా? అని ప్రశ్నించాడు. నాటు నాటు పాటలో ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ మాత్రం చాలా అద్భుతంగా ఉందని శివశక్తి దత్తా ప్రశంసించాడు. ఈ పాటకు రామ్ చరణ్, ఎన్టీఆర్ అద్భుతంగా డ్యాన్స్ చేశారని కొనియాడారు. రాజమౌళి కాన్సెప్ట్ అదుర్స్.. చంద్రబోస్, కీరవాణి కృషికి నాటు నాటు పాట రూపంలో ఫలితం దక్కిందని చెప్పుకొచ్చాడు.
Read More :
Srinidhi Shetty | యశ్ అలాంటోడు కాదు.. రూమర్స్‌కు చెక్ పెట్టిన కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

