Srinidhi Shetty | యశ్ అలాంటోడు కాదు.. రూమర్స్‌కు చెక్ పెట్టిన కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి
Srinidhi Shetty | ‘కేజీఎఫ్' రెండు భాగాల చిత్రాలతో నాయికగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది కన్నడ తార శ్రీనిధి శెట్టి. ఈ సినిమాలు సాధించిన రికార్డ్ స్థాయి విజయాలు ఆమె కెరీర్ స్థిరపడేలా చేశాయి.
Srinidhi Shetty | ‘కేజీఎఫ్’ రెండు భాగాల చిత్రాలతో నాయికగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది కన్నడ తార శ్రీనిధి శెట్టి. ఈ సినిమాలు సాధించిన రికార్డ్ స్థాయి విజయాలు ఆమె కెరీర్ స్థిరపడేలా చేశాయి. నట ప్రయాణంలో సంతోషంగా ఉన్న ఈ భామను ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు బాధించాయి.
‘కేజీఎఫ్’ హీరో యష్ ఆమెను ఇబ్బంది పెట్టాడని కొందరు నెటిజన్లు తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. ఈ విమర్శలపై సమాధానం చెప్పిందీ తార. యష్ ఒక జెంటిల్మన్ అని, తననెప్పుడూ ఇబ్బంది పెట్టలేదని పేర్కొంది. శ్రీనిధి శెట్టి తన తాజా సోషల్ మీడియా పోస్టులో స్పందిస్తూ…‘కొంతమంది తప్పుడు ప్రచారాలు చేసేందుకు, వదంతులు పుట్టించేందుకు సోషల్ మీడియాను ఉపయోగిస్తుంటారు. నేను ప్రేమను పంచేందుకు ఇదొక సాధనం అనుకుంటా. ‘యష్‌తో నటించేప్పుడు సెట్లో నాకెప్పుడూ ఇబ్బంది ఎదురుకాలేదు. ఆయన ఒక జెంటిల్మన్. అతనితో కలిసి నటించడాన్ని ఆస్వాదించాను’ అని చెప్పింది. శ్రీనిధి శెట్టి ఇచ్చిన స్పష్టతతో ఈ రూమర్స్‌కు చెక్ పెట్టినట్లయింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

