Pathaan Movie | ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న పఠాన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Pathaan Movie on OTT | గత రెండేళ్లుగా సరైన హిట్టు లేక బాలీవుడ్ బాక్సాఫీస్ తేలిపోయింది. పైగా ఈ రెండేళ్ళలో హిందీ బెల్ట్‌పై సౌత్ సినిమాలు విళయతాండవం చేశాయి. కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ వంటి పలు సౌత్ సినిమాలు ఊహించని రేంజ్లో నార్త్‌లో కలెక్షన్లు సాధించాయి.
Pathaan Movie on OTT | కరోనా ప్రభావంతో కష్టకాలంలో పడిపోయిన అన్ని ఇండస్ట్రీలు కుదురుకున్నాయి. ఒక్క బాలీవుడ్ ఇండస్ట్రీ తప్ప. గత రెండేళ్లుగా సరైన హిట్టు లేక బాలీవుడ్ బాక్సాఫీస్ తేలిపోయింది. మధ్యలో ‘భూల్ భూలయా-2’, ‘దృష్యం-3’ వంటి సినిమాలు బాలీవుడ్‌కు నేనున్నా అంటూ పలకరించినా.. ఎక్కడో సౌత్ సినిమాల డామినేషన్ కనిపించింది. సౌత్ సినిమాల కలెక్షన్లు ముందు అవి నథింగ్లా అనిపించాయి. పైగా ఈ మధ్య కాలంలో బాలీవుడ్లో బైకాట్ అంశం ఎక్కువైపోయింది. దాంతో సినిమాలు రిలీజ్ చేయాలంటేనే దర్శక, నిర్మాతల్లో ఎక్కడ లేని గుబులు. ఈ క్రమంలో అన్ని వివాదాలను ఎదుర్కొంటూ పఠాన్ జనవరి 25న ప్రేక్షకులు ముందుకు వచ్చింది.

రిలీజ్ ముందు నుంచి ఈ సినిమాపై ఎక్కడ లేని బజ్ ఏర్పడింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అంతే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది. తొలిరోజే అనుకుంటే వరుసగా ఆరు రోజులు వంద కోట్ల గ్రాస్‌కు దిగకుండా కలెక్షన్లు రాబడుతూ బాలీవుడ్ బాక్సాఫీస్‌కు ఊపిరిపోసింది. షారుఖ్‌ఖాన్ యాక్షన్, దీపికా అందాలు, జాన్ అబ్రహం విలనిజం ప్రేక్షకులను థియేటర్లకు రిపీటెడ్‌గా వచ్చేలా చేశాయి. బాహుబలి-2 పేరిట ఉన్న ఐదేళ్ల రికార్డును బద్దలు కొట్టి.. బాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా సంచలనం సృష్టించింది. ఇలా చెప్పుకుంటూ పోతే పఠాన్ మూవీ ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ఓటీటీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ అమెజాన్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసింది. కాగా ఈ సినిమా మార్చి 25 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. షారుఖ్‌కు జోడీగా దీపికా పదుకొనే నటించింది. జాన్ అబ్రహం కీలకపాత్రలో నటించిన ఈ సినిమాను యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించాడు.

తాజాగా ఈ సినిమా మరో రికార్డును కూడా నెలకొల్పింది. దాదాపు 800 స్క్రీన్లలో 50రోజులు పూర్తి చేసుకుని కరోనా తర్వాత అత్యధిక సెంటర్లలో ఆ ఘనత సాధించిన సినిమాగా పఠాన్ నిలిచింది. దాదాపు రూ.250 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ. 550 కోట్లకు పైగా షేర్‌ను సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.1044.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి వెయ్యి కోట్ల మార్కు టచ్ చేసిన రెండో హిందీ సినిమాగా సరికొత్త రికార్డు నెలకొల్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

