Tollywood Movies This Week | నవంబర్ నెల మొదలు కాగానే లక్కీ భాస్కర్ రూపంలో మంచి హిట్ వచ్చింది తెలుగు ఇండస్ట్రీకి. ఆ తర్వాత చిన్న సినిమాగా వచ్చి అదే రోజు విడుదలైన కిరణ్ అబ్బవరం చిత్రం సూపర్ హిట్‌ను అందుకోవడమే కాకుండా రూ.50 కోట్ల వసూళ్లను రాబట్టింది. వీటితో పాటు డబ్బింగ్ సినిమాగా వచ్చిన అమరన్ కూడా మంచి కలెక్షన్స్‌ను రాబట్టింది. అయితే గతవారం ఇదే ఊపుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్‌తేజ్ మట్కా బాక్సాఫీస్ వద్ద డిజాస్టార్ టాక్ తెచ్చుకుంది. దీంతో డిసెంబర్లో వచ్చే పుష్ప 2 సినిమాపైనే అందరి ఆశలు ఉన్నాయి.
అయితే పుష్ప 2 సినిమాకు ఉన్న హైప్ వలన డిసెంబర్లో ఏ సినిమా విడుదల చేయడానికి ముందుకు రావట్లేదు. దీంతో పుష్ప వచ్చే ఈ 14 రోజుల గ్యాప్‌ను వాడుకుందామని చూస్తున్నాయి చిన్న సినిమాలు. ఇందులో విశ్వక్ సేన్ సినిమాతో పాటు అశోక్ గల్లా సినిమాలు ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే ఈ వారం థియేటర్‌తో పాటు ఓటీటీలో వచ్చే సినిమాలు చూసుకుంటే.
‘జీబ్రా’
సత్యదేవ్ (Satyadev) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘జీబ్రా’(Zebra). లక్ ఫేవర్స్ ది బ్రేవ్.. అన్నది ఉపశీర్షిక. ఈ సినిమాకు ఈశ్వర్ కార్తీక్ (Eswar Karthik) దర్శకత్వం వహిస్తుండగా.. ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎస్ఎన్ రెడ్డి, బాలసుందరం, దినేష్ సుందరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీని నవంబర్ 22 తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
మెకానిక్ రాకీ..
విశ్వక్ సేన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం మెకానిక్ రాకీ. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా.. శ్రద్ధా శ్రీనాథ్ మరో కీలకపాత్ర పోషిస్తుంది. సునీల్, నరేశ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు రవి తేజ ముల్లపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
KCR (కేశవ చంద్ర రమావత్)
జబర్తస్థ్ ఫేమ్, నటుడు రాకింగ్ రాకేశ్ కథానాయకుడిగా నటిస్తూ.. నిర్మిస్తున్న తాజా చిత్రం ‘కేసీఆర్’ (కేశవ చంద్ర రమావత్). ఈ సినిమాకు ‘గరుడ వేగ’ అంజి దర్శకత్వం వహిస్తుండగా.. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రానుంది. తనికెళ్ల భరణి, తాగుబోతు రమేష్, కృష్ణ బగవాన్, జబర్దస్త్ ఫేమ్ ధనరాజ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
దేవకీ నందన వాసుదేవ
మహేశ్ బాబు మేనల్లుడు.. ప్రముఖ పారిశ్రామికవేత్త జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా (Ashok Galla) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం దేవకీ నందన వాసుదేవ (Devaki Nandana Vasudeva). జాంబిరెడ్డి, హనుమాన్ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ వర్మ (Prashanth Verma) ఈ చిత్రానికి కథనందిస్తుండగా.. గుణ 369 ఫేం అర్జున్ జంధ్యాల (Arjun Jandyala) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నవంబర్ 22 ప్రేక్షకుల ముందుకు రానుంది.
రోటి కపడా రొమాన్స్
‘హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. ఈ సినిమా నవంబర్ 22 ప్రేక్షకుల ముందుకు రానుంది.
మందిర..
బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ సన్నీ లియోనీ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం మందిర. కోలీవుడ్ నటుడు యోగిబాబు ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం కూడా నవంబర్ 22న విడుదల కానుంది.
ఓటీటీలో వచ్చే సినిమాలు వెబ్ సిరీస్‌లు
డిస్నీ ప్లస్ హాట్ స్టార్..
ఇంటీరియర్ చైనా టౌన్.. వెబ్ సిరీస్.. (నవంబర్ 19)
కిష్కిందకాండమ్.. తెలుగు (నవంబర్ 19)
ఏలియన్ రొమ్యులస్..హాలీవుడ్.. (నవంబర్ 21)
అవుట్ ఆఫ్ మై మైండ్.. హాలీవుడ్.. (నవంబర్ 22)
అమెజాన్ ప్రైమ్
క్యాంపస్ బీట్స్ 2.. హిందీ.. (నవంబర్ 20)
ఈటీవీ విన్
ఐహేట్ లవ్.. తెలుగు.. (నవంబర్ 21)
రేపటి వెలుగు.. తెలుగు.. (నవంబర్ 21)
జియో సినిమా
బ్యాక్ టు బ్లాక్.. హలీవుడ్.. (నవంబర్ 17)
డ్యూన్: ప్రొఫెసి.. వెబ్ సిరీస్.. (నవంబర్ 18)
హరోల్డ్ అండ్ ది పర్పుల్ క్రేయాన్.. హాలీవుడ్.. (నవంబర్ 23)
నెట్ ఫ్లిక్స్
నయతార: బియాండ్ ది ఫెయిరీ టేల్
వాండరూస్ 2.. యానిమేషన్ సిరీస్.. నవంబర్ 18
జాంబీ వర్స్.. కొరియన్ సిరీస్.. నవంబర్ 19
జాయ్.. హాలీవుడ్.. నవంబర్ 22
పోకెమాన్ హారిజాన్స్ ది సిరీస్ 4.. యానిమేషన్.. నవంబర్ 22
స్పెల్ బౌండ్.. యానిమేషన్.. నవంబర్ 22
ది పియానో లెసన్.. హాలీవుడ్.. నవంబర్ 22
యే కాలీ కాలీ ఆంఖే.. హిందీ సిరీస్.. నవంబర్ 22