Tamannaah Bhatia | హీరోయిన్గా టాలీవుడ్, బాలీవుడ్‌లను ఏలింది. జువెలరీ బిజినెస్‌లో అడుగుపెట్టి సక్సెస్ఫుల్ ఆంత్రప్రెన్యూర్‌గా నిరూపించుకుంది. ప్రభుత్వ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ రియల్ లైఫ్ హీరోయిన్ అనిపించుకుంది. ఆమె ఎవరో కాదు.. ఫ్యాన్స్ మిల్కీ బ్యూటీ అని పిలుచుకునే పంజాబీ సుందరి తమన్నా భాటియా. బోళా శంకర్, జైలర్ సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో బిజీగా ఉన్న తమన్నా కార్వాన్ ముచ్చట్లు ..
ఫ్రెండ్స్, ఇంట్లోవాళ్లు తమ్మీ అని పిలుస్తారు. ఇండస్ట్రీలో మిల్క్ బ్యూటీ అంటారు. ఇంటర్లో ఉండగానే సినిమా అవకాశం వచ్చింది. ఆ తర్వాత బిజీ కావడంతో డిస్టెన్స్‌లో డిగ్రీ పూర్తి చేశాను.
మొఘల్-ఎ-ఆజమ్, దిల్ తో పాగల్ హై, దిల్వాలే దుల్హనియా లే జాయేంగే.. ఈ మూడు సినిమాలూ చాలా ఇష్టం. ఎన్నిసార్లు చూశానో లెక్కే లేదు. తెలుగులో ఆనంద్ (మంచి కాఫీలాంటి సినిమా), హాలీవుడ్లో టైటానిక్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ఇరిన్ బ్రొకోవిచ్ నా సినిమా లైబ్రరీలో టాప్‌లో ఉంటాయి.
సెలవు దొరికితే పారిస్, దుబాయ్, కశ్మీర్ వెళ్లిపోతా. కశ్మీర్ అందాలు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టవు. పారిస్, దుబాయ్ రిచ్ కల్చర్ నన్ను ఆకట్టుకుంటుంది.
చిన్నప్పుడు అన్నం సరిగ్గా తినకపోయేదాన్ని. అమ్మ కోప్పడేది. ఇప్పుడు కూడా లంచ్ స్కిప్ చేస్తుంటా. కానీ, అమ్మకు తెలియదు.. అంతే తేడా. షూటింగ్ టైమ్‌లో భోజనం ఎగ్గొడితే మాత్రం కాఫీ తాగడం అలవాటు. కాఫీ మెషిన్ నా వెంట ఉంటుంది.
సమయం దొరికితే.. ఏదో ఒకటి రాస్తుంటా. నాలోని రచయిత్రి గురించి చాలామందికి తెలియదు. చెప్పను కూడా. నాకు ఓ పిచ్చి నమ్మకం ఉంది. ‘ఎనిమిది’ని దురదృష్ట సంఖ్యగా భావిస్తా. చిన్నచిన్న చేదు అనుభవాల వల్ల మైండ్‌లో అలా ఫిక్స్ అయ్యాను. న్యూమరాలజిస్ట్ సలహాతో నా పేరులో ఏ, హెచ్.. రెండు అక్షరాలు జోడించుకున్నా. ఆ తర్వాత నిజంగానే లక్ కలిసొచ్చిందనుకోండి. రోలర్ కోస్టర్ అంటే నాకు భయం. సినిమాలో ఆ సీన్ ఉంటే.. అస్సలు చేయను. అవసరమైతే సినిమా వదులుకుంటా.
సోషల్ మీడియా రూమర్లను పట్టించుకోను. నా తల్లిదండ్రుల తర్వాత నన్ను ఇంతగా ప్రేమించే, అభిమానించే ఫ్యాన్స్‌కు చెప్పకుండా పెళ్లెందుకు చేసుకుంటాను.. చెప్పండి?
ఆ రోజు వస్తే.. పత్రికా ముఖంగానే ప్రకటిస్తా.
కెరీర్లో ఎత్తుపల్లాలు సాధారణం. నేను చేసిన కొన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. కొన్ని అడ్రస్ లేకుండానూ పోయాయి. గెలిచినప్పుడు ఏం సాధించామని కాకుండా.. ఓడిపోయినప్పుడు ఎందుకు ఓడిపోయామని ఆలోచిస్తే సక్సెస్ మన వెంటే ఉంటుంది. ఓటమి కూడా బాధపెట్టదు.
పదమూడేండ్ల వయసులో ‘చాంద్ సా రోషన్ చెహ్రా’ అనే సినిమాలో తెర మీద కనిపించాను. ఆ తర్వాత యాక్టింగ్‌ను కెరీర్‌గా ఎంచుకొని ముంబైలోని పృథ్వీ థియేటర్లో ఏడాదిపాటు యాక్టింగ్ నేర్చుకున్నా. సినిమా అవకాశాలు పెరిగిపోవడంతో డిస్టెన్స్‌లో డిగ్రీ పూర్తిచేశాను. చాలామంది మోడలింగ్‌లో అనుభవం వచ్చాక సినిమాల్లో ట్రై చేస్తారు. కానీ.. నా విషయంలో మాత్రం ఇది ఉల్టా జరిగింది. ముందు సినిమాలో నటించి.. ఆ తర్వాత మోడలింగ్ చేశాను.
సొంతంగా నేను వైట్ అండ్ గోల్డ్ అనే జువెలరీ బ్రాండ్ ప్రారంభించాను. ఇప్పటి వరకైతే సక్సెస్‌ఫుల్‌గానే నడుస్తున్నది. ఇంకా విస్తరించాల్సి ఉంది. బేటీ బచావో.. కార్యక్రమానికి
బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉన్నాను.
“Tamannaah Bhatia | చిట్టిపొట్టి దుస్తుల్లో కుర్రాలను ఆగం చేస్తున్న తమన్నా భాటియా..”