Unstoppable with Balakrishna | బాలయ్య షోకు చిరంజీవి రానన్నాడా.. అన్స్టాపబుల్కు రావడం ఇష్టం లేదా?
అన్స్టాపబుల్కు చిరంజీవి వస్తాడనే ప్రచారం జోరుగా జరుగుతుంది. నిజానికి ఈయన మొదటి సీజన్లోనే రావాల్సి ఉంది. మెగాస్టార్ కోసం చాలా ప్రయత్నించారు నిర్వాహకులు. దానికోసం ఆయన్ని కలవడానికి ఇంటికి కూడా వెళ్లారు.
Unstoppable with Balakrishna | ఆహాలో అన్‌స్టాపబుల్ షోతో నిజంగానే అన్‌స్టాపబుల్ రికార్డులు కొల్లగొడుతున్నాడు బాలయ్య. ఈ షోకు ఊహించిన దానికంటే మంచి రెస్పాన్స్ వస్తుంది. మొదటి ఎపిసోడ్‌లోనే చంద్రబాబు నాయుడు రావడంతో.. రాబోయే వారాల్లో మరింత బిగ్ లిస్ట్ ఉండబోతుందని ఊహించిన వాళ్లకు.. రెండో వారం విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ లాంటి కుర్ర హీరోలు రావడంతో కాస్త నిరుత్సాహ పడుతున్నారు అభిమానులు. అదేంటి.. ఆ రేంజ్లో సీజన్ మొదలుపెట్టి.. రెండో ఎపిసోడ్‌కే అలా తగ్గించేసారు అంటూ కామెంట్స్ కూడా వస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఈ సారి అన్స్టాపబుల్కు చిరంజీవి వస్తాడనే ప్రచారం జోరుగా జరుగుతుంది. నిజానికి ఈయన మొదటి సీజన్లోనే రావాల్సి ఉంది. మెగాస్టార్ కోసం చాలా ప్రయత్నించారు నిర్వాహకులు.
దానికోసం ఆయన్ని కలవడానికి ఇంటికి కూడా వెళ్లారు. అయితే చిరు మాత్రం కాస్త సున్నితంగానే అన్స్టాపబుల్కు రావడానికి తిరస్కరించాడు. ముందు నుంచి కూడా ఈ షోకు రావడానికి చిరు ఎందుకో అన్యమనస్కంగానే ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే మొదటి సీజన్‌కు మాత్రమే కాదు.. రెండో సీజన్లోనూ చిరును ఊహించడం కష్టమే అనిపిస్తుంది.
బాలయ్యతో చిరంజీవికి మంచి అనుబంధమే ఉంది. పైగా ఇది అల్లు అరవింద్ షో.. అంటే ఆల్మోస్ట్ సొంత షో కిందే లెక్క. అయినా కూడా ఎందుకో మరి చిరంజీవికి అన్‌స్టాపబుల్ అంతగా రుచించడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. సీజన్ 2లో కచ్చితంగా మెగాస్టార్ వస్తాడు.. బాలయ్య, చిరంజీవిలను ఒకే వేదికపై చూడాలని ఆశిస్తున్న అభిమానులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్. చిరు మిస్ అయినా.. ఈ సారి పవన్ కళ్యాణ్ రానున్నట్లు బాలయ్యే సంకేతాలు పంపించాడు.
తాజాగా విడుదలైన ప్రోమోలో త్రివిక్రమ్‌తో ఫోన్లో మాట్లాడిన బాలయ్య.. నా షోకు ఎప్పుడు వస్తున్నావని అడిగాడు. దానికి మాటల మాంత్రికుడు కూడా ఓకే అని చెప్పాడు. ఎవరితో రావాలో తెలుసుగా అంటూ బాలయ్య అడిగే సరికి నవ్వేసి ఊరుకున్నాడు త్రివిక్రమ్. ఈ సీన్ అంతా చూస్తుంటే కచ్చితంగా ఈ సారి పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ అన్‌స్టాపబుల్‌లో కనిపించడం ఖాయమైపోయింది. కాకపోతే పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో.. సరైన డేట్ కోసం చూస్తున్నారు. అది దొరికిందంటే కచ్చితంగా సీజన్ 2లో బాలయ్య షోలో పవన్ కనిపించడం ఖాయం.
ఇవి కూడా చదవండి..
కాంతార కలెక్షన్స్.. అల్లు అరవింద్ పంట మామూలుగా పండలేదుగా..!
sushant singh rajput | సుశాంత్ రాజ్‌పుత్ ఫ్రెండ్స్‌కు ఏమైంది.. ఆ బ్యాచ్‌లో నలుగురు ఆత్మహత్య!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

