కాంతార కలెక్షన్స్.. అల్లు అరవింద్ పంట మామూలుగా పండలేదుగా..!
అల్లు అరవింద్ ఇలాంటి మ్యాజిక్ ఎన్నోసార్లు చేశాడు. ఇప్పుడు కాంతార సినిమా విషయంలో ఇదే జరుగుతుంది. ఈ సినిమా కన్నడలో చరిత్ర సృష్టిస్తుంది అని తెలిసిన వెంటనే.. తెలుగు నుంచి అందరికంటే ముందు అక్కడికి వెళ్లి అనువాద హక్కులను తీసుకున్నాడు.
ఇతర భాషల్లో చరిత్ర సృష్టించిన చాలా సినిమాలను ఎంతో మంది నిర్మాతలు కొని తెలుగులో విడుదల చేస్తుంటారు. కానీ ఎలాంటి సినిమాలు తీసుకొని ఏ సమయంలో విడుదల చేస్తే కలెక్షన్స్ బాగా వస్తాయి అని తెలిసిన నిర్మాతకే లాభాలు కూడా వస్తుంటాయి. ఈ విషయంలో అల్లు అరవింద్ ను మించిన మాస్టర్ మైండ్ మరొకరు లేరు.
ముక్కు మొహం తెలియని వాళ్ళ సినిమాలు కూడా తీసుకొని తెలుగులో విడుదల చేసి కోట్లు సంపాదించుకున్న దాఖలాలు ఎన్నో ఉన్నాయి. 16 సంవత్సరాల కింద సూర్య, మురుగదాస్ ఎవరో కూడా సరిగ్గా తెలియని సమయంలో ఆ కాంబినేషన్ లో వచ్చిన గజినీ సినిమా తెలుగు హక్కులను భారీ రేటు పెట్టి తీసుకున్నప్పుడు అందరూ నవ్వుకున్నారు. కానీ అదే సినిమా తెలుగులో ఏకంగా 16 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాత అదే సినిమాను హిందీలో రీమేక్ చేసి ఇండియాలో తొలి 100 కోట్ల సినిమాను ఖాతాలో వేసుకున్నాడు ఈ నిర్మాత.
అల్లు అరవింద్ ఇలాంటి మ్యాజిక్ ఎన్నోసార్లు చేశాడు. ఇప్పుడు కాంతార సినిమా విషయంలో ఇదే జరుగుతుంది. ఈ సినిమా కన్నడలో చరిత్ర సృష్టిస్తుంది అని తెలిసిన వెంటనే.. తెలుగు నుంచి అందరికంటే ముందు అక్కడికి వెళ్లి అనువాద హక్కులను తీసుకున్న నిర్మాత అల్లు అరవింద్. అసలు తెలుగులో రిషబ్ శెట్టి అంటే ఎవరో ఎవరికీ తెలియదు.. పైగా కాంతార సినిమా పూర్తిగా కన్నడ సంస్కృతి సాంప్రదాయాల ఆధారంగా తెరకెక్కింది. ఇలాంటి సినిమా తెలుగులో విడుదల చేస్తే విజయం సాధిస్తుంది అని నమ్మకం ఎవరికి లేదు.
అందుకే ఈ సినిమా వైపు ఎవరూ వెళ్లలేదు.. కానీ అది సాధించిన విజయం చూసిన తర్వాత వారం రోజులకు వెళ్లి డబ్బింగ్ హక్కులు సొంతం చేసుకున్నాడు అల్లు అరవింద్. ఆయన నమ్మకం వమ్ము కాలేదు. కేవలం 2 కోట్ల రూపాయలతో ఈ సినిమా హక్కులను తీసుకుంటే.. రెండు రోజుల్లోనే 5 కోట్ల షేర్ వచ్చింది. రాబోయే రోజుల్లో కచ్చితంగా మరో 10 కోట్ల షేర్ వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. వీక్ డేస్ మొదలైన తర్వాత కూడా హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి అంటే తెలుగు రాష్ట్రాల్లో కాంతార హవా ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ స్థాయి విజయం సాధిస్తుందని నిజానికి అల్లు అరవింద్ కూడా అంచనా వేయలేదు. కచ్చితంగా హిట్ అవుతుందని నమ్మాడు కానీ ఇలా కన్నడ కంటే తెలుగులోనే ఎక్కువ ఓపెనింగ్స్ తీసుకొస్తుందని అసలు అనుకోలేదు. ఏదేమైనా కాంతార సినిమాతో అల్లు అరవింద్ పంట పండింది. ఈ సినిమా మీద తక్కువ 12 కోట్ల లాభం అయితే ఈ నిర్మాత అందుకోవడం ఖాయం అయిపోయింది.
ఇవి కూడా చదవండి..
Read Also :Vikram 61 | విక్రమ్ 61 అప్డేట్.. రష్మిక స్థానంలో సోషల్ మీడియా సెన్సేషన్..!
Read Also : Nithiin | క్రేజీ టాక్.. నితిన్‌తో భీమ్లానాయక్ డైరెక్టర్ చర్చలు..?
Read Also : Priyamani DR56 look | ప్రియమణి DR56 ఫస్ట్ లుక్.. లాంఛ్ చేసిన విజయ్ సేతుపతి
Read Also : Ritika nayak | బార్బీ డాల్‌లా రితికా నాయక్ ట్రాన్స్ ఫార్మేషన్.. ట్రెండింగ్‌లో వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

