టాలీవుడ్ (Tollywood) భామ అక్కినేని సమంత (Samantha) సినిమాలతోపాటు సోషల్ మీడియాలో కూడా చురుకుగా ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ భామ ఏదో ఒక స్టిల్ తో ఫాలోవర్లను పలుకరిస్తుంటుంది. ఎప్పటికపుడు ట్రెండీ లుక్ లో కనిపిస్తూ సందడి చేస్తుంది. సామ్ ఈ సారి ఏకంగా ఫ్యాషన్ ప్రపంచానికే ఐకాన్ గా నిలిచేలా సరికొత్త లుక్ లో దర్శనమిస్తూ అందరూ అవాక్కయ్యేలా చేస్తోంది. తాజాగా సామ్ లూయిస్ వుయిట్టన్ అవుట్‌ఫిట్ (Louis Vuitton outfit) లో మెరిసిపోతూ కెమెరాకు ఫోజులిచ్చింది.
బ్లాక్ స్లీవ్ లెస్ లో టాప్, డిజైన్ డ్ జాగర్స్ లో దిగిన ఫొటోలు నెటిజన్లను కళ్లు పక్కకు తిప్పుకోనీయకుండా చేస్తున్నాయి. ప్రీతమ్ జుకాల్కర్ డిజైన్ చేసిన డ్రెస్ లో సోషల్ మీడియా అటెన్షన్ ను తనవైపు తిప్పుకుంటుంది. మరోవైపు సామ్ చేతిలో ఉన్న లూయిస్ వుయిట్టన్ లగేజ్ బ్యాగ్, కాళ్లకు వేసుకున్న గోధుమ రంగు బూట్లు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తున్నాయి. బ్యాగ్ ఖరీదు రూ.2.5 లక్షలు కాగా..బూట్ల విలువ రూ.1.5 లక్షలు. స్టైలిష్ అవతారంలో ఖరీదైన వస్తువులతో సామ్ దిగిన ఫొటోలు ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.
సమంత ప్రస్తుతం పౌరాణిక పురాణ ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కుతున్న శాకుంతలం (Shaakuntalam) లో నటిస్తోంది. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. మరోవైపు తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ డైరెక్షన్ లో నయనతార, విజయ్ సేతుపతితో కలిసి కాతువాకుల రెండు కాధల్ సినిమా చేస్తోంది.