Tollywood | టాలీవుడ్ హీరోలు రోజురోజుకి అప్డేట్ అవుతున్నారు. మూసధారణిలో కాకుండా సరికొత్త కథాంశంతో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులకి మంచి వినోదం పంచుతున్నారు. టాలీవుడ్ క్రేజ్ ఇప్పుడు హాలీవుడ్ స్థాయికి చేరడంతో మన హీరోలతో సినిమాలు చేసేందుకు ఇతర ఇండస్ట్రీలకి చెందిన దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా తమిళ దర్శకులు ఈ మధ్య టాలీవుడ్ హీరోలని టార్గెట్ చేస్తూ వారితో బడా ప్రాజెక్టులు చేసేందుకు ప్లాన్స్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కొన్ని కాంబోస్ సెట్ అవ్వగా.. మరిన్ని చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తుంది.
ముందుగా మనం తమిళ ప్రముఖ దర్శకుడు అట్లీ గురించి మాట్లాడుకోవాలి. చేసింది తక్కువ సినిమాలే అయితే ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టే సినిమాలు చేశాడు. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో వర్క్ చేస్తున్నారు. బన్నీ బర్త్ డే సందర్భంగా వారిద్దరి ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఓ వీడియో రిలీజ్ చేస్తూ మూవీ ఎలా ఉంటుంది అనే హింట్ కూడా ఇచ్చారు. చూస్తుంటే ఈ ప్రాజెక్ట్ హాలీవుడ్ మూవీలని మించి ఉంటుందని, ఈ సినిమాతో పాత రికార్డులన్నీ కనుమరుగు అవుతాయని చెప్పుకొస్తున్నారు.
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో సెట్ అయిన మరో క్రేజీ ప్రాజెక్ట్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమా. ఈ మూవీ మరి కొద్ది రోజులలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రం తర్వాత యంగ్ టైగర్, జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంల ఓ ప్రాజెక్ట్ చేయనున్నట్టు టాక్ వినిపిస్తుంది. రీసెంట్ గా తెలుగు నిర్మాత నాగ వంశీతో వర్క్ చేయనున్నట్లు ఎన్టీఆర్ ఓ ఈవెంట్లో తెలిపారు. అది ఈ మూవీ గురించే అని అర్ధమవుతుంది. మరోవైపు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇతర సినిమాలతో బిజీగా ఉండగా, ఆయన త్వరలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం రామ్ చరణ్ హీరోగా శంకర్ గేమ్ ఛేంజర్ అనే చిత్రం తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇలా కోలీవుడ్ దర్శకులు టాలీవుడ్ హీరోలతో కలిసి పలు ప్రయోగాలు చేస్తూ మంచి హిట్స్ సాధిస్తున్నారు. ఇది ఇప్పుడు ట్రెండింగ్‌గా మారిందని చెప్పాలి.