Actor Sharwanand | టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కారు ప్రమాదానికి గురైంది. ఆదివారం తెల్లవారు జామున శర్వానంద్ ప్రయాణిస్తున్న రేంజ్ రోవర్ కారు ఫిలింనగర్ జంక్షన్ వద్ద డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శర్వానంద్‌కు స్వల్ప గాయాలయ్యాయి. శర్వానంద్ ప్రయాణిస్తున్న కారుకు బైక్ అడ్డు రావడంతో దాన్ని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం నుంచి శర్వానంద్ కారును కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. కాగా తాజాగా ఈ ప్రమాదంపై శర్వానంద్ టీమ్ స్పందించింది. ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేవని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇక ఇటీవలే శర్వానంద్ తన ప్రేయసి రక్షితా రెడ్డితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. మరో వారం రోజుల్లో రాజస్థాన్‌లోని జైపూర్ లీలా ప్యాలెస్‌లో వీరి పెళ్లి జరుగనుంది. జూన్ 2, 3 తేదీల్లో గ్రాండ్‌గా వివాహ వేడుకలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయని సమాచారం. కాగా ఇలాంటి సమయంలో శర్వానంద్ కారుకు ప్రమాదం జరగడం కుటుంబ సభ్యులను, ఫ్యాన్స్‌ను కలవర పెడుతుంది.