Tollywood | శుక్రవారం వచ్చిందంటే థియేటర్స్ దగ్గర సందడి ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి తెగ సందడి చేస్తుంటాయి. ఓటీటీలు వచ్చాక థియేటర్స్కి ప్రేక్షకుల రాక తక్కువ అవుతుందని అందరు అనుకున్నారు. కాని సినిమాకి మంచి టాక్ వస్తే థియేటర్స్ కూడా కళకళలాడుతున్నాయి. అయితే గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలలో మ్యాడ్ స్క్వేర్ చిత్రం మంచి హిట్ టాక్ పొంది అదిరిపోయే వసూళ్లని రాబడుతుంది. అయితే ఈ వారం కూడా కొన్ని మూవీస్ థియేటర్లలో విడుదల అయ్యాయి.
పెద్ద సినిమాల సందడి లేకపోయినా.. పలు చిన్న మూవీలు ఏప్రిల్ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో లైఫ్ (లవ్ యువర్ ఫాదర్), రామ్ గోపాల్ వర్మ శారీతోపాటు 28 డిగ్రీ సెల్సియస్ వంటి చిన్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అలానే వాటితో పాటు 34 ఏళ్ల తర్వాత నందమూరి బాలకృష్ణ క్లాసిక్ హిట్ చిత్రం ఆదిత్య 369 మూవీ కూడా రీరిలీజ్ అయింది. ఇ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఆర్య2 చిత్రం 17 సంవత్సరాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాలలో ఏ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులని అలరించలేకపోయింది.
ఆదిత్య 369 మూవీ అప్పట్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు రీరిలీజ్లోను సంచలనం సృష్టిస్తుందని అనుకున్నారు. ఇందుకోసం భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా, ఆ వేడుకకి బాలయ్య హాజరై అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రీ రిలీజ్ లో ఆదిత్య 369కు ఊహించని వసూళ్లు వస్తాయని అనుకున్నారు. కాని థియేటర్స్ దగ్గర ఆడియన్సే కరువయ్యారు. ఈ సినిమాను 4కే వెర్షన్ గా మార్చడానికి పెట్టిన ఖర్చు కూడా రాలేదని టాక్ నడుసక్తుంది. ఇక ఆర్య2 చిత్రం కొన్ని చోట్ల మోస్తరు కలెక్షన్స్ని రాబట్టినట్టు తెలుస్తుంది. రామ్ గోపాల్ వర్మ శారీ మూవీ అయితే 10% ఓపెనింగ్ కూడా సాధించలేకపోయింది. మిగతా చిన్న చిత్రాలు ఫ్లాపులుగా నిలిచాయి. మొత్తానికి ఈ ఫ్రైడే డ్రైడేగా మారిందని చెప్పాలి. అనుకున్న వసూళ్లు ఏ మూవీ రాబట్టలేకపోయింది.