Director Venky Atluri | ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఉత్తరాది నుండి దక్షిణాది వరకు పలు ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. రణ్‌బీర్-అలియాల పెళ్లి నుండి నయనతార-విఘ్నేష్ శివన్, నాగ శౌర్య, హన్సిక, మంజిమా మోహన్, అధితి వంటి పలువురు స్టార్లు గతేడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఇక ఇటీవలే టాలీవుడ్ యంగ్ హీరో శర్వా కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. కాగా తాజాగా టాలీవుడ్ యంగ్ దర్శకుడు పెళ్లి పీటలెక్కాడు.
ఆ టాలీవుడ్ యంగ్ దర్శకుడు ఎవరా అనుకుంటున్నారా? ఆయన మరెవరో కాదు తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి. తాజాగా ఆ యంగ్ దర్శకుడు వివాహా బంధంలోకి అడుగుపెట్టాడు. కాగా వీరి పెళ్లికి హీరో నితిన్ తన సతీమణితో కలిసి వచ్చాడు. వీరితో పాటుగా హీరోయిన్ కీర్తిసురేష్, దర్శకుడు వెంకీ కుడుముల కూడా పెళ్లికి హాజరైయ్యారు. తాజాగా నితిన్ వీళ్లతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నందుకు వెంకీ అట్లూరికి అభినందనలు తెలిపాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
‘స్నేహగీతం’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ‘తొలి ప్రేమ’ సినిమాతో దర్శకుడిగా మారాడు వెంకీ అట్లూరి. మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత అఖిల్‌తో ‘మిస్టర్ మజ్ను’, నితిన్‌తో ‘రంగ్‌దే’ సినిమాలు తెరకెక్కించాడు. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ప్రస్తుతం ఈయన ధనుష్‌తో ‘సార్’ తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.