Harish Shankar | పవన్ కళ్యాణ్‌తో సినిమాలు ఫిక్స్ అయిన రోజే తెలుసు.. అవి అనుకున్న టైమ్‌లో పూర్తికావని! కొన్ని రోజులు రాజకీయాలు.. కొన్ని రోజులు సినిమాలు అంటూ పవన్ తిరుగుతూ ఉంటాడు కాబట్టి వాళ్లకు కూడా క్లారిటీ లేదు. కాకపోతే ఆ సమయంలో ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్ చూసి కచ్చితంగా అనుకున్న సమయానికే సినిమాలు పూర్తి చేస్తాడేమో అని అనుకున్నారు. అయితే తెలంగాణ ఎన్నికల సందర్భంగా నెలరోజులు లీవ్ తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఏపీ ఎన్నికల కోసం ఏకంగా 5 నెలలకు పైగా సెలవులు తీసుకుంటున్నాడు. ఇప్పట్లో మళ్లీ కెమెరా ముందుకు రావడం కష్టమే అని తేలడంతో ఇతర సినిమాలతో బిజీ అయిపోతున్నారు ఆయనతో సినిమాలు కమిటైన దర్శకులు.
ఈ క్రమంలోనే మూడు సంవత్సరాలుగా పవన్ కోసం కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేసిన హరీశ్ శంకర్.. ఎట్టకలకు రవితేజ హీరోగా మరో సినిమా మొదలు పెట్టాడు. ఇప్పటికే ఈ కాంబినేషన్లో షాక్, మిరపకాయ్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మూడో సినిమాకు రంగం సిద్ధం అవుతుంది. నిజానికి చాలా రోజులుగా రవితేజ, హరీశ్ కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఎప్పటికప్పుడు అది అబద్ధం అని హరీశ్ శంకర్ కొట్టి పారేశాడు. పవన్ కళ్యాణ్ సినిమా తప్ప మరో సినిమాకు కమిట్ అవ్వలేదని చెప్పాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కోసం వెయిట్ చేయడం ఆయన కెరీర్‌కు కూడా మంచిది కాదు. అందుకే తప్పదని తెలిసిన తర్వాత ఇంకో సినిమా వైపు వెళ్ళాడు ఈ దర్శకుడు. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన రైడ్ సినిమాకు ఇది రీమేక్ అని తెలుస్తోంది. రీమేక్ సినిమాలు చేయడంలో హరీశ్ శంకర్ స్పెషలిస్ట్.
కేవలం లైన్ మాత్రమే తీసుకొని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కథను పూర్తిగా మారుస్తుంటాడు ఈయన. గతంలో గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ లాంటి సినిమాలు అలాగే తెరకెక్కించాడు హరీశ్ శంకర్. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో చేస్తున్న ఉస్తాద్ కూడా తేరీ సినిమా రీమేక్. అలాగే రవితేజ సినిమాను కూడా ఇక్కడి ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టు తెరకెక్కించాలని చూస్తున్నాడు హరీశ్ శంకర్. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. కేవలం 4 నెలల్లోనే ఈ సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడు హరీశ్. మరోవైపు గోపీచంద్ మలినేనితో అనుకున్న సినిమా ఆగిపోవడంతో రవితేజ కూడా హరీశ్ వైపు వచ్చాడు. మరి ఈ కాంబినేషన్లో రాబోయే సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. మొత్తానికి పవన్ కళ్యాణ్ పర్మిషన్ ఇవ్వడంతో దర్శకుడు తమ పని తాము చేసుకుంటున్నారు.