గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం పురస్కరించుకుని టాలీవుడ్‌లోని ప్రముఖ నటీనటులు, దర్శకులు సోషల్‌మీడియా వేదికగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. కేసీఆర్ గారు ఎల్లప్పుడూ ఆరోగ్యంతో, సంతోషంగా వుండాలని ఈ సందర్భంగా వాళ్లు కోరుకున్నారు. కేసీఆర్ గారు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో వుండాలని, లక్ష్యసాధనకి, ప్రజాసేవకి ఆయనకు ఆ భగవంతుడు అపరిమిత శక్తి సామార్ధ్యాలు ప్రసాదించాలని నటుడు చిరంజీవి ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవితో పాటు జనసేన పార్టీ అధ్యక్షుడు, కథానాయకుడు పవన్‌కల్యాణ్, హీరోలు అక్కినేని నాగార్జున, మహేష్‌బాబు, విజయ్‌దేవరకొండ, రవితేజ, నితిన్, మంచు విష్ణు, రానా దగ్గుబాటి, నటి, నిర్మాత మంచు లక్ష్మీ ప్రసన్న, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, దర్శకులు హరీష్ శంకర్,అనిల్ రావిపూడి, తదితరులు సోషల్‌మీడియా ద్వారా సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.