Tollywood Actors New Year Wishes | కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ టాలీవుడ్ అగ్ర నటులు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
మెగాస్టార్ చిరంజీవి కొత్త ఏడాది సందర్భంగా.. 2024కి వీడ్కోలు చెబుతూ.. 2025కి స్వాగతం.. ఈ కొత్త సంవత్సరం మరింత ప్రకాశవంతంగా విస్తరించాలని, కొత్త ఆశలు, ఆకాంక్షలు సాకారం చేసుకునే శక్తిని అందివ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. భారతీయ సినిమా వైభవం మరింత ప్రకాశవంతంగా విస్తరించాలి. కొత్త సంవత్సరమంతా ప్రేమతో కలిసిమెలిసి ఉంటూ అందరితో ఆనందాన్ని పంచుకోవాలని కోట్లాదిమంది అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Bye Bye 2024 & Welcome 2025 !! 🎉🥳🎊🍾
May the year 2025 give all of us New Hopes,Aspirations, Life & Career goals and the Drive & Energy to realise them all. May the Glory of Indian Cinema spread farther and shine brighter!!
Happy New Year to All ! May Love, Laughter and Joy…
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 1, 2025
గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారం మొదలవుతోన్న నూతన సంవత్సరం సందర్భంగా ప్రతిఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నటుడు పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా రాసుకోచ్చాడు.
ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.@PawanKalyan pic.twitter.com/RxCHFwWR4r
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) December 31, 2024
పుష్ప 2 సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న్యూ ఇయర్ విషెస్ తెలుపుతూ.. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా అభిమానులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. లవ్ యూ ఆల్ అంటూ రాసుకోచ్చాడు.
Happy New Year to each and every one of you . Happy New year to all my Fans . I l love you all 🖤
— Allu Arjun (@alluarjun) December 31, 2024
నూతన సంవత్సర శుభాకాంక్షలు.. ఈ ఏడాది మరింత ఆనందాన్ని, విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా అంటూ ఎన్టీఆర్ రాసుకోచ్చాడు.
Wishing you all a very Happy New Year 2025. May this year bring you joy and success.
— Jr NTR (@tarak9999) December 31, 2024