Drugs Case | నా కెరీర్, నా కూతురి కెరీర్ నాశనం అవుతోంది.. వీడియో రిలీజ్ చేసిన సురేఖవాణి
Drugs Case | డ్రగ్స్ కేసులో కేపీ చౌదరి అరెస్టు సినీ ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేపుతోంది. చాలామంది సినీ ప్రముఖులను కేపీ చౌదరి డ్రగ్స్ విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సినీ నటి సురేఖవాణి, ఆమె కూతురు సుప్రీత పేర్లు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
Drugs Case | డ్రగ్స్ కేసులో కేపీ చౌదరి అరెస్టు సినీ ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేపుతోంది. చాలామంది సినీ ప్రముఖులను కేపీ చౌదరి డ్రగ్స్ విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సినీ నటి సురేఖవాణి, ఆమె కూతురు సుప్రీత పేర్లు ఇప్పుడు వైరల్‌గా మారాయి. వాళ్లిద్దరికీ డ్రగ్స్ కేసులో సంబంధాలు ఉన్నాయని పలు కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో సురేఖవాణి స్పందించింది. తనకు ఈ కేసుతో సంబంధం లేదని చెబుతూ ఒక వీడియోను రిలీజ్ చేసింది.
ఇటీవల డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ కేపీ చౌదరిని కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని రెండు రోజుల పాటు పోలీసులు విచారించారు. అతని కాల్ డేటాతో పాటు ముఖ్యమైన సమాచారాన్ని సేకరించారు. ఈ క్రమంలో పలువురు సెలబ్రెటీలతో కేపీ చౌదరి సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటకొచ్చాయి. దీంతో వాళ్లందరూ కేపీ దగ్గర డ్రగ్స్ తీసుకుని ఉంటారనే కథనాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలోనే సినీ నటి సురేఖవాణి, కూతురు సుప్రీతతో కేపీ చౌదరి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిలో ఒక ఫొటోలో కేపీ చౌదరికి సురేఖవాణి ముద్దుపెడుతుండగా.. మరో ఫొటోలో సుప్రీత కేపీకి దగ్గరగా ఉంది. మూడో ఫొటోలో కేపీతో తల్లీకూతుళ్లు కలిసి ఉన్న ఫొటో కూడా ఒకటి చక్కర్లు కొడుతోంది. దీంతో సురేఖవాణి, ఆమె కూతురికి డ్రగ్స్ కేసుతో సంబంధం ఉందని వార్తలు వచ్చాయి.
గత కొంతకాలంగా తమపై వస్తున్న ఆరోపణలకు.. తమకు ఎలాంటి సంబంధం లేదని సురేఖవాణి స్పష్టం చేసింది. దయచేసి తమపై ఇలాంటి ఆరోపణలు చేయడం ఆపేయాలని విజ్ఞప్తి చేసింది. మీరు చేస్తున్న వాటివల్ల తన కెరీర్, తన పిల్లల కెరీర్ నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి ఆరోపణల కారణంగా అన్ని రకాలుగా ఎఫెక్ట్ అవుతున్నాం.. ప్లీజ్ అర్థం చేసుకోండి అని కోరింది. మొత్తానికి డ్రగ్స్, కేపీ చౌదరి పేర్లు ప్రస్తావించకుండా తనకు మాదక ద్రవ్యాల కేసుతో సంబంధం లేదని ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. అంతకుముందు సినీ నటి జ్యోతి కూడా తనకు డ్రగ్స్ కేసుతో సంబంధం లేదని చెబుతూ ఒక వీడియోను విడుదల చేసింది. కేపీ చౌదరి తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని తెలిపింది. నిజానిజాలు తెలియకుండా తన ఫొటోలు ప్రచురించవద్దని కోరింది.
Read More :
Drugs Case | డ్రగ్స్ కేసుతో నాకు సంబంధాలు లేవు.. ఇన్‌స్టాలో సినీ నటి జ్యోతి ఆవేదన
SSMB29 | మహేష్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్.. రాజమౌళి ప్రాజెక్ట్ మొదలయ్యేది అప్పుడే?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

