Drugs Case | డ్రగ్స్ కేసుతో నాకు సంబంధాలు లేవు.. ఇన్‌స్టాలో సినీ నటి జ్యోతి ఆవేదన
Drugs Case | డ్రగ్స్ కేసులో సినీ నిర్మాత కేపీ చౌదరి అరెస్టు కావడం సినీ ఇండస్ట్రీలో చాలామంది పేర్లు బయటకొస్తున్నాయి. ఇటీవల కేపీ చౌదరి కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆషు రెడ్డితో పాటు పలువురికి ఈ కేసుతో సంబంధాలు ఉన్నట్లు కథనాలు వచ్చాయి.
Drugs Case | డ్రగ్స్ కేసులో సినీ నిర్మాత కేపీ చౌదరి అరెస్టు కావడం సినీ ఇండస్ట్రీలో చాలామంది పేర్లు బయటకొస్తున్నాయి. ఇటీవల కేపీ చౌదరి కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆషు రెడ్డితో పాటు పలువురికి ఈ కేసుతో సంబంధాలు ఉన్నట్లు కథనాలు వచ్చాయి. ముఖ్యంగా ఆషురెడ్డితో పాటు టాలీవుడ్లో ఐటెం సాంగ్ చేసిన ఓ నటితో కేపీ చౌదరి వందలాది ఫోన్ కాల్స్ మాట్లాడాడని విచారణలో తెలిసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సినీ నటి జ్యోతి ఫొటోలతో పలు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. తమ మధ్య స్నేహం మాత్రమే ఉందని.. ఎలాంటి డ్రగ్ డీలింగ్స్ లేవని స్పష్టం చేసింది. నిజానిజాలు తెలియకుండా తన ఫొటోలు ప్రచురించవద్దని కోరింది.
ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోందని.. అలాంటి టైమ్‌లో ఫొటోలు ఎలా ప్రచురిస్తారని సినీ నటి జ్యోతి ప్రశ్నించింది. తనకంటూ ఒక జీవితం లేదా? ఆ ఫొటోలు చేసి మా కుటుంబం బాధపడదా? అని ఆవేదన వ్యక్తం చేసింది. దయచేసి నిజానిజాలు తెలిసేదాకా ఫొటోలు ఉపయోగించవద్దని విజ్ఞప్తి చేసింది. కేపీ చౌదరి తనకు మంచి మిత్రుడని.. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా మాత్రమే ఉంటామని జ్యోతి స్పష్టం చేసింది. డ్రగ్స్ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. కేపీ ఏర్పాటు చేసిన డ్రగ్స్ పార్టీలకు ఎప్పుడూ హాజరు కాలేదని చెప్పింది. తనేమీ భయపడి దాక్కోలేదని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఎలాంటి డ్రగ్స్ వినియోగించలేదని.. ఒకవేళ విచారణకు పిలిస్తే తప్పకుండా వెళ్తానని తెలిపింది. మీకు కావాలంటే డేటా, ఇంకా ఏమైనా తీసుకొని విచారణ జరుపుకోవచ్చని చెప్పింది. ఇప్పటివరకు తన ఫోన్ నుంచి ఒక్క మెసేజ్, కాల్ డేటా డిలీట్ చేయలేదని తెలిపింది. నార్కొటిక్ టెస్ట్‌కు కూడా రెడీ అని చెప్పింది.
Read More :
SSMB29 | మహేష్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్.. రాజమౌళి ప్రాజెక్ట్ మొదలయ్యేది అప్పుడే?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

