Dhamaka Movie Dubbing | ‘పెళ్ళి సందD’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే యూత్‌ను తనవైపు తిప్పుకుంది శ్రీలీల. రాకేష్ రోషన్ హీరోగా నటించిన ఈ చిత్రం గతేడాది దసరాకు విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్ర విజయంలో శ్రీలీల కీలకపాత్ర వహించింది. ఈ మూవీలో తన నటన, అందాల ఆరబోతతో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం తర్వాత ఈ అమ్మడు టాలీవుడ్లో తెగ బిజీ అయింది. వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం ఈమె చేతిలో అరడజనుకు పైగానే సినిమాలున్నాయి. అందులో ‘ధమాకా’ ఒకటి. మాస్మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహించాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేసింది.
తాజాగా శ్రీలీల డబ్బింగ్ పనులు షురూ చేసింది. కాగా ఈ సినిమా రైటర్ ప్రసన్న కుమార్ శ్రీలీలతో డబ్బింగ్ స్టూడీయోలో దిగిన ఫోటోను షేర్ చేశాడు. ఈ చిత్రంలో శ్రీలీల ప్రణవి పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ఈమె పోస్టర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్ బ్యానర్లపై అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీలీల ఈ చిత్రంతో పాటు నితిన్-వక్కంతం వంశీ సినిమాలో నటిస్తుంది. ఇక బాలకృష్ణ-అనీల్ రావిపూడి చిత్రంలో బాలకృష్ణకు కూతురుగా నటిస్తుంది. వీటితో పాటుగా మంత్రి గాలిజనార్థన్ రెడ్డి కుమారుడు కిరీటీ డెబ్యూ మూవీలోనూ హీరోయిన్గా ఎంపికైంది.
#Sreeleela Started Dubbing For @RaviTeja_offl's #Dhamaka pic.twitter.com/jPQKonoruD
— Suresh Kondi (@SureshKondi_) August 8, 2022