KamakshiBhaskarla | మనసు బాలేకపోతే బయటికి షికారుకి వెళ్లి రావడం.. సినిమాకి వెళ్లడం. ట్రావెలింగ్‌కి వెళ్లడం చూస్తూ ఉంటాం. కానీ తన మనసు బాలేగకపోతే శ్మశానానికి వెళ్లి వస్తానని చెబుతుంది టాలీవుడ్ బ్యూటీ కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla). పోలిమేర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ తన సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గోనగా.. ఈ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
కామాక్షి మాట్లాడుతూ.. నా మనసు బాలేనప్పుడు బాగా డిప్రెషన్లోకి వెళ్లినప్పుడు శ్మశానానికి వెళ్లి వస్తుంటా. అక్కిడికి వెళితే ఒక తెలియని ప్రశాంతత దొరుకుతుంది. చాలా ఎనర్జీ వస్తుంది. మైండ్ కూడా ఎంతో రిలీఫ్‌గా అనిపిస్తుందంటూ ఈ భామ చెప్పుకోచ్చింది. అయితే కామాక్షి మాటలను విన్న నెటిజన్లు.. హారర్ సినిమాలు చేసి చేసి కామాక్షి అందులోనే జీవిస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు. సినిమాల విషయానికి వస్తే.. కామాక్షి ప్రస్తుతం అల్లరి నరేష్‌తో కలిసి ’12ఎ రైల్వే కాలనీ’ అనే థ్రిల్లర్ సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నాని కాసరగడ్డ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.