RRR Movie Update | ఉక్రెయిన్ కు రాంచరణ్, ఎన్టీఆర్..లేటెస్ట్ అప్డేట్స్
RRR Movie Update | ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ తార ఒలివియా మొర్రీస్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది.

రాంచరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్ ( RRR movie ) . ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మూవీలో రాంచరణ్ ( Ram Chran ) అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తోండగా..కొమ్రం భీంగా ఎన్టీఆర్ ( NTR ) కనిపించనున్నాడు. బాలీవుడ్ నటి అలియాభట్ సీత పాత్రలో నటిస్తోంది. ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ తార ఒలివియా మొర్రీస్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రంలోని ఓ పాట షూటింగ్ కోసం లీడింగ్ యాక్టర్లంతా రేపు ఉక్రెయిన్ కు బయలుదేరనున్నారు.
ఉక్రెయిన్ లోని పలు ప్రాంతాల్లో పాటను చిత్రీకరించనున్నారు. ఇప్పటికే రాజమౌళి అండ్ టీం ఉక్రెయిన్ లోని ఐకానిక్ ప్యాలెస్ లో షూటింగ్ కోసం అనుమతులు కూడా తీసుకుందట. ఈ పాటను సినిమాకే హైలెట్ గా నిలిచిపోయేలా సిల్వర్ స్క్రీన్ పై విజువల్ ఫీస్ట్గా కనిపించేలా తీయబోతున్నారు మేకర్స్. ఉక్రెయిన్ షెడ్యూల్ తో ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొత్తం పూర్తయినట్టే.
శ్రియా శరణ్, అజయ్ దేవ్ గన్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది ఆర్ఆర్ఆర్.
ఇవి కూడా చదవండి..
రూ.25 లక్షలు గెలుచుకున్న రాంచరణ్
‘రామారావు’తో వేణు గ్రాండ్ కమ్బ్యాక్
అసిస్టెంట్ డైరెక్టర్ గా బిగ్ బాస్ బ్యూటీ
రాజ్ కుంద్రా బెయిల్ తిరస్కరణ..గెహనా వశిష్ఠ్ పై కేసు
షూటింగ్స్ తో ఢిల్లీ భామ బిజీ షెడ్యూల్..!
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

