Sharwanand Engagement Date | టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్లలో ఒకడైన శర్వానంద్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు గత రెండు రోజల నుండి వార్తలు వస్తున్నాయి. తెలంగాణకు చెందిన అమ్మాయితో శర్వా ఏడడుగులు వేయబోతున్నట్లు తెలుస్తుంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆ అమ్మాయి యూఎస్ఏలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుందట. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంతో ఇటీవలే హైదరాబాద్‌కు తిరిగొచ్చిందని టాక్. ఇక ఇదిలా ఉంటే తాజాగా శర్వా ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
శర్వానంద్ ఎంగేజ్మెంట్ జనవరి 26న జరుగనున్నట్లు తెలుస్తుంది. సమ్మర్లో పెళ్లిని ప్లాన్ చేస్తున్నారట. ఇక శర్వా పెళ్లి వార్త బయటకు రాగానే.. ప్రభాస్ కూడా పెళ్లి చేసుకోవాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవలే శర్వా అన్‌స్టాపబుల్ ఎపిసోడ్లో పెళ్ళి ప్రశ్నలపై స్పందిస్తూ.. ప్రభాస్ పెళ్లి తర్వాత నాది అంటూ బదులిచ్చిన విషయం తెలిసిందే. ఇక శర్వా సినిమాల విషయానికొస్తే.. గత కొంత కాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న శర్వాకు గతేడాది రిలీజైన ‘ఒకే ఒక జీవితం’ మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌లో శర్వా ప్రస్తుతం రెండు సినిమాలను సెట్స్ మీద ఉంచాడు.