Sudheer Babu | ఎస్ఎంఎస్ సినిమాతో లీడ్ రోల్లో సిల్వర్ స్క్రీన్‌పై మెరిశాడు సుధీర్ బాబు (Sudheer Babu) . ప్రేమ కథా చిత్రమ్‌తో హీరోగా సూపర్ బ్రేక్ అందుకున్నాడు. ఆ తర్వాత సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రొఫెషనల్‌గా ఫుల్ బిజీగా ఉన్న సుధీర్ బాబు తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన స్టిల్ ఒకటి వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ఫొటో ఎవరిదనే కదా మీ డౌటు.
ఫొటోలో క్యూట్‌గా కనిపిస్తుందెరో కాదు. సుధీర్ బాబు సతీమణి ప్రియదర్శిని (Priyadarshini). తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ప్రియదర్శినికి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. నా దగ్గర ఉన్న ఆమె మొదటి ఫోటో. పెళ్లిచూపులు ఫోటో.. అంటూ క్యాప్షన్ ఇచ్చాడు సుధీర్ బాబు. ప్రియదర్శిని సంప్రదాయ నీలం రంగు చుడిదార్ సూట్లో సూపర్ లుక్‌లో కనిపిస్తోంది. ఈ స్టిల్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. సుధీర్ బాబు- ప్రియదర్శిని 2006లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఇద్దరు కుమారులు.
సుధీర్ బాబు ప్రస్తుతం హరోంహర సినిమాలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా కథాంశంతో Sudheer18గా తెరకెక్కుతున్న హరోం హర జూన్ 14న విడుదల కానుంది. 1989 బ్యాక్ డ్రాప్లో చిత్తూరులోని కుప్పం నేపథ్యంలో సాగే స్టోరీతో పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి చేతన్ భరద్వాజ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
హరోం హర తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. సుధీర్ బాబు మరోవైపు మా నాన్న సూపర్ హీరో సినిమాలు నటిస్తుండగా.. షూటింగ్ దశలో ఉంది. దీంతోపాటు పుల్లెల గోపీచంద్ బయోపిక్‌లో నటిస్తున్నాడు.
హరోం హర కాన్సెప్ట్ టైటిల్ వీడియో..
మురుగుడి మాయ పాట..
కనులెందుకో సాంగ్ ప్రోమో..
మురుగుడి మాయ మేకింగ్ స్టిల్స్..
Frames that captured the essence of #MurugudiMaaya 🔥
Here’s few BTS clicks from the song making💥
– https://t.co/3yXU2Vp0C4#HaromHara #HaromHaraOnMay31st @isudheerbabu @ImMalvikaSharma @gnanasagardwara @chaitanmusic @Music_Vengi @SumanthnaiduG @SSCoffl @JungleeMusicSTH pic.twitter.com/DCixBVPf1S
— BA Raju’s Team (@baraju_SuperHit) May 16, 2024