సీనియర్ నటుడు రఘునాథ రెడ్డి కన్నుమూత
తెలుగు చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు రఘునాథ రెడ్డి (83) శనివారం రాత్రి హైదరాబాద్ కుషాయిగూడలో గుండెపోటుతో కన్నుమూశారు. రఘునాథ రెడ్డి కృష్ణా జిల్లా కుందేరులో జన్మించారు. తొలుత రంగస్థల కళాకారుడిగా రాణించారాయన.
తెలుగు చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు రఘునాథ రెడ్డి (83) శనివారం రాత్రి హైదరాబాద్ కుషాయిగూడలో గుండెపోటుతో కన్నుమూశారు. రఘునాథ రెడ్డి కృష్ణా జిల్లా కుందేరులో జన్మించారు. తొలుత రంగస్థల కళాకారుడిగా రాణించారాయన. ‘పునరపి జననం’ ‘సంధ్యాఛాయ’ ‘ధర్మో రక్షిత రక్షిత’ వంటి నాటకాల ద్వారా మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు ఎన్నో అవార్డులు పొందారు. ‘కళ్లు’ సినిమా ద్వారా రఘునాథ రెడ్డి నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. సర్పయాగం, చీమలదండు, ఒరేయ్ రిక్షా, పోలీస్, ఎర్రోడు, సూర్యపుత్రులు, కలిసుందాం రా, ఇంద్ర, డాన్, తమ్ముడు, రాయలసీమ రామన్న చౌదరి, మల్లీశ్వరి, సంక్రాంతి, శ్రీరామరాజ్యం వంటి చిత్రాల్లో సహాయ పాత్రల్లో నటించి మెప్పించారు.
2018లో వచ్చిన ‘సుబ్రహ్మణ్యపురం’ ఆయన నటించిన చివరి సినిమా. దాదాపు 350కిపైగా చిత్రాల్లో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించారు. అనారోగ్య కారణాల వల్ల రఘునాథ రెడ్డి గత కొంతకాలంగా నటనకు దూరంగా ఉంటున్నారు. ఆయన ఏకైక కుమారుడు నెల రోజుల క్రితం గుండెపోటుతో మరణించారు. కుమారుడి మరణం ఆయన్ని మరింతగా క్రుంగదీసిందని, ఆ బాధలోనే తీవ్ర అనారోగ్యానికి గురై కాలం చేశారని తెలిసింది. రఘునాథ రెడ్డి మృతిపట్ల పలువురు నటీనటులు సంతాపం ప్రకటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revenue Officer: రెవన్యూ అధికారి హత్య.. ముగ్గురు కుటుంబసభ్యులు అరెస్టు
Manchi Venkat | ‘ఆదర్శ కుటుంబం’లో ‘పర్ణశాల’ పాట వివాదం.. సినిమాను బతికించండంటూ నిర్మాత ఆవేదన
Filmmaker Sanjay Gupta | బాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా కన్నుమూత!
PM Modi: ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను ప్రశంసించిన ప్రధాని మోదీ
YS Sharmila | బెంగళూరులోని యలహంక ప్యాలెస్ నా బిడ్డల హక్కు : వైఎస్ షర్మిల
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

