శనివారం 06 మార్చి 2021
Cinema - Jan 20, 2021 , 17:12:55

చిరు 'లూసిఫ‌ర్' రీమేక్ మొద‌లైంది..వీడియో

చిరు 'లూసిఫ‌ర్' రీమేక్ మొద‌లైంది..వీడియో

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మ‌ల‌యాళ సూప‌ర్‌హిట్ చిత్రం లూసిఫ‌ర్ రీమేక్‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. మోహ‌న్‌రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ ప్రాజెక్టు నేడు పూజాకార్య‌క్రమాల‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్, సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్వీఆర్ ఫిలిమ్స్ బ్యాన‌ర్ పై ఎన్వీ ప్ర‌సాద్-ఆర్ బీ చౌదరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా కార్య‌క్ర‌మంలో నిర్మాత అల్లు అర‌వింద్‌, అశ్వినీ ద‌త్‌, డీవీవీ దాన‌య్య‌, నిరంజన్‌ రెడ్డి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్‌, నాగ‌బాబు, కొరటాల శివ‌, ర‌చ‌యిత స‌త్యానంద్‌తోపాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. 

ఫిబ్ర‌వ‌రి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంద‌ని ఎన్వీ ప్ర‌సాద్ తెలిపారు. మోహ‌న్ రాజా మ‌న నేటివిటికి సరిపోయేవిధంగా క‌థను అద్భుతంగా రాసార‌ని, చిరంజీవి కెరీర్‌లో 153వ చిత్రంగా వ‌స్తున్న ఈ ప్రాజెక్టు బ్లాక్ బాస్ట‌ర్ గా నిలుస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

శృతిహాస‌న్‌, అమ‌లాపాల్‌..బోల్డ్‌గా 'పిట్ట‌క‌థ‌లు' టీజ‌ర్‌

కిస్ ఇవ్వ‌లేద‌ని.. ఆమె న‌న్ను వదిలేసి వెళ్లింది

రాశీఖ‌న్నాకు నో చెప్పిన గోపీచంద్‌..!

టాలీవుడ్‌ మోస్ట్ వాంటెడ్ విల‌న్ ఇత‌డే..!

చిరంజీవి న‌న్ను చాలా మెచ్చుకున్నారు..


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo