Singham Agian | బాలీవుడ్ ‘సింగం’లో టాలీవుడ్ నటుడు
Singham Agian | బాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లో ‘సింగం 3’(Singham Agian) ఒకటి. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి వచ్చిన రెండు సినిమాలు కమర్షియల్‌గా భారీ విజయాలు సాధించాయి. ఇక ఇప్పుడు సింగం-3 (Singham Agian) తెరకెక్కబోతుంది. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుంది.
Singham Agian | బాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లో ‘సింగం 3’(Singham Agian) ఒకటి. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి వచ్చిన రెండు సినిమాలు కమర్షియల్‌గా భారీ విజయాలు సాధించాయి. ఇక ఇప్పుడు సింగం-3 (Singham Agian) తెరకెక్కబోతుంది. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుంది. రోహిత్ శెట్టి (Rohit Shetty) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు నటిస్తున్నట్లు తెలిసింది. టాలీవుడ్ సీనియర్ నటుడు అజయ్ (Ajay) ఈ చిత్రంలో పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. సింగం సెట్లో అజయ్ దేవ్గన్తో అజయ్ దిగిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరోవైపు ఈ మూవీలో విలన్‌గా అర్జున్ కపూర్ నటిస్తున్నాడు. ఇక బాలీవుడ్ స్టార్ నటులు టైగర్ ష్రాఫ్, రణ్వీర్ సింగ్, కరీనా కపూర్ అక్షయ్ కుమార్ స్పెషల్ రోల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వారికి సంబంధించిన పోస్టర్లను కూడా వదిలారు.
The versatile actor #Ajay, known for his phenomenal roles in Telugu cinema alongside star heroes, is now stepping into a cop role in #Singham with @ajaydevgn ❤️🔥
The Singham series is one of Bollywood’s biggest franchises! pic.twitter.com/49UHbImHNU
— BA Raju’s Team (@baraju_SuperHit) May 20, 2024
12 ఏండ్ల కిందట వచ్చిన సింగం సినిమా బాలీవుడ్లో ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అజయ్ దేవగణ్ హీరోగా నటించిన ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టింది. నిజానికి ఇది సూర్య నటించిన యముడు సినిమాకు రీమేక్. దీనికి కొనసాగింపుగా మూడేళ్లకు సింగం రిటర్న్స్ తెరకెక్కింది. ఇది తొలిపార్టుకు మించి కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇక అప్పటికే గోల్మాల్ సిరీస్‌తో రక్షిత్‌శెట్టి-అజయ్ దేవగణ్‌ల కాంబినేషన్ సూపర్ హిట్టు అనిపించుకోగా.. సింగం సిరీస్‌తో తిరుగులేని కాంబినేషన్లా క్రేజ్ తెచ్చుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

