Tollywood | రోజులు ఎంత తొందరగా గడిచిపోతున్నాయి. కొత్త సంవత్సరం వచ్చింది, అప్పుడే ఆరు నెలలు పూర్తైంది. ఫస్టాఫ్‌లో చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా, వాటిలో కొన్ని సినిమాలు బ్లాక్‌బస్టర్ కాగా, మరికొన్నింటికి బాక్సాఫీస్ వద్ద ఊహించినంత ఫలితం రాలేదు. ఇప్పుడు సెకండాఫ్ ప్రారంభమైంది. ఈ భాగంలో నెలకు కనీసం ఒక్క పాన్ ఇండియా మూవీని ప్రేక్షకులు థియేటర్లలో చూసే ఛాన్స్ ఉంది. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతోంది? అవి ఏ హీరోల సినిమాలు? అనే వివరాలు అనేది చూస్తే.. జులైలో పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదలై బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం నిరాశపరిచింది. జూలై 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
ఇక ఆగస్ట్ విషయానికి వస్తే రెండు పాన్ ఇండియా చిత్రాలు ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగాయి. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ మూవీ, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్,హృతిక్ రోషన్ కాంబోలో రూపొందిన వార్-2 సినిమాలు.. ఆగస్టు 14న రిలీజ్ అయ్యాయి. దర్శకులు లోకేష్ కనగరాజ్, అయాన్ ముఖర్జీ ఈ చిత్రాలని యాక్షన్ డ్రామాలుగా రూపొందించారు. ఇక సెప్టెంబర్ లో వివిధ పాన్ ఇండియా సినిమాలు విడుదల కానుండగా, వాటిలో యంగ్ హీరో తేజ సజ్జా అప్ కమింగ్ మూవీ మిరాయ్ తొలివారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
సెప్టెంబర్ 5న మిరాయ్ ప్రేక్షకుల ముందుక రానుంది . ఆ తర్వాత నటసింహం బాలకృష్ణ అఖండ 2, పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రాలు విడుదల కానున్నాయి. ఓజీ సెప్టెంబర్ 25న విడుదల కానుండగా, బాలయ్య అఖండ 2 మూవీపై క్లారిటీ రావలసి ఉంది. సెప్టెంబర్‌లోనే విడుదల కానుందని అంటున్నారు కాని పక్కా డేట్ అయితే చెప్పడం లేదు. మరోవైపు అక్టోబర్ లో స్టార్ హీరో రిషబ్ శెట్టి తన సూపర్ హిట్ చిత్రం కాంతారా ప్రీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కాంతారా: చాప్టర్ 1 అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నవంబర్ లో మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి పాన్ ఇండియా రిలీజ్ లేదు.. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో పాన్ ఇండియా ప్రభాస్ రాజా సాబ్ తో థియేటర్స్ లోకి రానున్నారు. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. అదే రోజు రణవీర్ సింగ్ దురంధర, షాహిద్ కపూర్ సినిమాలు కూడా ప్రేక్షకులని పలకరించబోతున్నాయి. ఇక క్రిస్మస్ స్పెషల్ గా యంగ్ హీరో అడివి శేష్ డెకాయిట్ తో పాటు అవతార్-3 చిత్రాలు కూడా సందడి చేయనున్నాయి.ఈ లిస్ట్‌లో మరి కొన్ని సినిమాలు యాడ్ అవుతాయి. అయితే ఏ సినిమాకు బ్లాక్‌బస్టర్ ట్యాగ్ దక్కుతుందో చూడాలి