అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘కరణ్ అర్జున్’. ఈ చిత్రాన్ని రెడ్ రోడ్ థ్రిల్లర్స్ పతాకంపై డా సోమేశ్వరరావు పొన్నాన, బాలకృష్ణ ఆకుల, సురేష్, రామకృష్ణ, క్రాంతి కిరణ్ నిర్మించారు. మోహన్ శ్రీవత్స దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 24న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ…‘మహా భారతంలోని కర్ణుడు, అర్జునుడి పాత్రల భావోద్వేగాలను నేపథ్యంగా ఎంచుకుని దానికి ఈతరం సాంకేతికత జోడించి తెరకెక్కించాం. మూడు పాత్రల మధ్య సాగే రోడ్ థ్రిల్లర్ చిత్రమిది. పాకిస్థాన్ సరిహద్దుల్లో చిత్రీకరణ చేశాం. ప్రతి సన్నివేశం ఆకట్టుకునేలా ఉంటుంది. అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోలు నిఖిల్, అభిమన్యు, నాయిక షిఫా, నిర్మాత బాలకృష్ణ ఆకుల తదితరులు పాల్గొన్నారు.