Tillu Square | మళ్లా ఏం పంచాయితీలా ఇరుక్కున్నావ్ రా టిల్లు.. హిలేరియస్‌గా రిలీజ్ ట్రైలర్
Tillu Square | టాలీవుడ్ యువ నటుడు సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తున్న తాజా చిత్రం టిల్లు స్క్వేర్ (Tillu Square). రెండేండ్ల కిందట వచ్చిన బ్లాక్ బస్టర్ కామెడీ ఎంటర్టైనర్ డీజే టిల్లుకు సీక్వెల్‌గా ఈ సినిమా రానుంది. మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్ కథనాయికగా నటిస్తుండగా.. మల్లిక్‌రామ్ (Mallik Ram) దర్శకత్వం వహిస్తున్నాడు.
Tillu Square | టాలీవుడ్ యువ నటుడు సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తున్న తాజా చిత్రం టిల్లు స్క్వేర్ (Tillu Square). రెండేండ్ల కిందట వచ్చిన బ్లాక్ బస్టర్ కామెడీ ఎంటర్టైనర్ డీజే టిల్లుకు సీక్వెల్‌గా ఈ సినిమా రానుంది. మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్ కథనాయికగా నటిస్తుండగా.. మల్లిక్‌రామ్ (Mallik Ram) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు ట్రైలర్లు విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతున్నాయి. అయితే ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్.
ఇక ఈ ట్రైలర్ గమనిస్తే.. మొదటి పార్ట్‌లో రాధికతో క్రైమ్ ఎపిసోడ్ మాదిరిగానే ఇందులోనూ లిల్లీతో మరో ఇంట్రెస్టింగ్ డ్రామా ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఫుల్ కామెడి ఫన్ ఎంటర్టైనర్గా ఉన్న ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ మూవీని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ తెరకెక్కిస్తున్నారు.
మరోవైపు ఈ చిత్రం సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ సినిమాకు యూ/ఏ (U/A)సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ విషయాన్ని చిత్రబృందం ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఇక రన్‌టైం విషయానికి వస్తే.. 121 నిమిషాలు ఉన్నట్లు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

