ముంబై : బాలీవుడ్ హాట్ లవర్స్ టైగర్ ష్రాఫ్, దిశా పటానీ (Disha Patani) కొద్దినెలల కిందట ఎవరి దారి వారు చూసుకున్నారు. బ్రేకప్ అనంతరం వారిద్దరూ మంచి స్నేహితులుగా మిగిలిపోగా ఇక వార్ నటుడు ఇటీవల దీక్షా ధనుకతో రిలేషన్షిప్లో ఉన్నట్టు వార్తలొచ్చాయి. ఇక బాలీవుడ్ భామ దిశా పటానీ సెర్బియన్ మోడల్, ఫ్రెండ్ అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్‌తో ప్రేమాయణం నడుపుతోందని చెబుతున్నారు.
వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారని వార్తలు రాగా, లేటెస్ట్గా వీరు కలిసిఉన్న వైరల్ వీడియో వీరి రిలేషన్‌షిప్‌పై సంకేతాలు పంపుతోంది. డేటింగ్ గురించి వీరిద్దరూ ధ్రువీకరించకపోయినా అలెక్స్‌తో దిశా పీకల్లోతు ప్రేమలో ఉందని వార్తలు గుప్పుమంటున్నాయి.
దిశా తన ఇన్స్టాగ్రాం స్టోరీలో అలెగ్జాండర్ అలెక్స్ ఫొటోను షేర్ చేసింది. అలెక్సి వంటి ఫ్రెండ్ లభించడం అదృష్టం అంటూ దిశా రాసుకొచ్చింది. ఇక తాము ఒకే అపార్ట్మెంట్లో ఉండేవారమని, ఇద్దరికీ ఫిట్నెస్ అంటే ఇష్టం కావడంతో క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యామని అలెక్స్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
Read More :