Gadar 2 | బాక్సాఫీస్ వద్ద గదర్ 2 సరికొత్త రికార్డ్ : రూ. 350 కోట్లకు చేరువైన సన్నీ డియోల్ మూవీ
బాక్సాఫీస్ వద్ద గదర్ 2 (Gadar 2) వసూళ్ల సునామీ కొనసాగుతోంది. ఈ మూవీ దేశీ వసూళ్లు శుక్రవారం రూ. 300 కోట్లు దాటాయి. ఈనెల 19న రెండో వారాంతంలోకి అడుగుపెట్టిన గదర్ 2 కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. స
ముంబై : బాక్సాఫీస్ వద్ద గదర్ 2 (Gadar 2) వసూళ్ల సునామీ కొనసాగుతోంది. ఈ మూవీ దేశీ వసూళ్లు శుక్రవారం రూ. 300 కోట్లు దాటాయి. ఈనెల 19న రెండో వారాంతంలోకి అడుగుపెట్టిన గదర్ 2 కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.
సన్నీడియోల్, అమీషా పటేల్ జంటగా తెరకెక్కిన ఈ మూవీ త్వరలో రూ. 350 కోట్ల మార్క్‌ను అధిగమించనుందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. గదర్ 2 8వరోజు రూ. 20.05 కోట్లు వసూలు చేయగా రూ. 300 కోట్ల మార్క్‌ను దాటి రూ. 305.13 కోట్ల వసూళ్లు సాధించింది.
రెండో వారాంతంలో అనిల్ శర్మ నిర్ధేశకత్వంలో రూపొందిన గదర్ 2 ఏకంగా రూ. 32 కోట్లు వసూలు చేసింది. దీంతో మొత్తం వసూళ్లు రూ. 336.13 కోట్లకు చేరాయి. గదర్ 2 రిలీజై వారం దాటినా హిందీ బెల్ట్‌లో సగటు ఆక్యుపెన్సీ 50 శాతం పైగా ఉండటంతో ఈ మూవీ వసూళ్లు ఆల్‌టైం హైకి చేరవచ్చని అంచనా వేస్తున్నారు.
Read More :
King Of Kotha Telugu | దుల్కర్ సల్మాన్ క్రేజ్‌కు నేషన్ ఫిదా.. ట్రెండింగ్‌లో కింగ్ ఆఫ్ కొత్త
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- collections
- Gadar 2
- Sunny Deol
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

