Tiger Nageswara Rao | టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) తాజాగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao). 1970లో స్టూవర్ట్‌పురంలో పాపులర్ దొంగగా చలామణిలో ఉన్న టైగర్ నాగేశ్వర్ రావు జీవిత కథ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. వంశీ (Vamsee) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో కృతి సనన్ చెల్లి నుపుర్ సనన్ హీరోయిన్గా నటిస్తోండగా.. నుపుర్సనన్కు ఇది టాలీవుడ్ డెబ్యూ ప్రాజెక్ట్ కావడం విశేషం. అక్టోబర్ 20న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్, ఫస్ట్ సింగిల్ లాంచ్ చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఒక సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
ఈ మూవీలో సీనియర్ నటి రేణూదేశాయ్ హేమలత లవణం పాత్రలో నటిస్తుంది. అయితే ఈ పాత్రకు సంబంధించిన కొత్త లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. బిడ్డను ఎత్తుకుని లాలిస్తున్నట్లు కనిపిస్తున్న ఈ పోస్టర్ హృదయాలను హత్తుకునేలా ఉంది. ఇక ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్ 3న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Introducing #RenuDesai as #HemalathaLavanam from #TigerNageswaraRao – 𝗔 𝗦𝗢𝗖𝗜𝗔𝗟 𝗥𝗘𝗙𝗢𝗥𝗠𝗘𝗥 𝗢𝗡 𝗔 𝗠𝗜𝗦𝗦𝗜𝗢𝗡 ❤🔥
TRAILER OUT ON OCTOBER 3rd 🔥
Grand Trailer Launch Event in Mumbai 🤩@RaviTeja_offl @DirVamsee @AnupamPKher @AbhishekOfficl @AAArtsOfficial… pic.twitter.com/K9yVJhIyma
— Vamsi Kaka (@vamsikaka) October 1, 2023
ఇదిలా ఉంటే.. ఇప్పటికే టైగర్ నాగేశ్వర రావు ప్రియురాలు సారా (నుపుర్ సనన్) పాత్ర లుక్‌ను షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో అనుపమ్ ఖేర్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి రాఘవేంద్ర రాజ్‌పుత్‌గా, కోలీవుడ్ భామ అనుకీర్తి వ్యాస్ జయవాణి పాత్రలో, మురళీ శర్మ విశ్వనాథ శాస్త్రిగా నటిస్తుండగా.. ఈ పాత్రలకు సంబంధించిన పోస్టర్లు సినిమాపై హైప్ పెంచుతున్నాయి.
ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తుండగా.. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. టైగర్ నాగేశ్వర రావు అక్టోబర్ 20న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీ నుంచి విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ ఏక్ దమ్ ఏక్ దమ్తోపాటు రెండో పాట మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది.