Tiger-3 Movie | బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ఒక భారీ హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు. 2019లో వచ్చిన ‘భారత్’ తర్వాత ఇప్పటివరకు ఈయనకు హిట్టు లేదు. అయితే ఫలితం ఎలా ఉన్నా సల్మాన్‌ఖాన్ మాత్రం వరుసగా సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. ఈ మధ్య విడుదలైన ‘గాడ్‌ఫాదర్’లో కాసేపు మెరిసాడు. ప్రస్తుతం ఈయన మూడు సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు. అందులో ‘టైగర్-3’ ఒకటి. టైగర్ సిరీస్‌లో మూడో ఫ్రాంచైజీగా రూపొందిన ఈ చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు.
ఇరవై ఏళ్ల జీవితాన్ని భారతదేశం కోసం అర్పించిన ఓ స్పై ఏజెంట్‌ను దేశ ద్రోహి అంటూ ముద్ర వేశారు. ఇరవై ఏళ్లు దేశాన్ని సంరక్షించిన ఆ స్పై ఇప్పటివరకు తిరిగి దేశాన్ని ఏమి కోరలేదు. కానీ ఇప్పుడు దేశ ద్రోహి అంటూ తనపై పడిన ముద్రను చెరిపేసుకోవడానికి తనకు క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలని దేశాన్ని కోరాడు. అంతవరకు దేశం కోసం పోరాడుతూనే ఉంటానంటూ గూస్బంప్స్ లెవల్లో ఉన్న గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ ఒక్క గ్లింప్స్‌తో సినిమా రేంజ్ ఏంటో ఇట్టే అర్థమయిపోతుంది. యాక్షన్ సీన్స్ కూడా హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి. ఇక చాలా కాలం తర్వాత సల్మాన్‌ను యాక్షన్ మోడ్‌లో చూడటంతో ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు.
యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా దీపావళి డేట్‌ను లాక్ చేసుకుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ సినిమా ఏకకాలంలో రిలీజ్ కాబోతుంది. యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సల్మాన్‌కు జోడీగా కత్రినా కైఫ్ హీరోయిన్గా నటిస్తుంది. గతంలో ఈ సిరీస్‌లో తెరకెక్కిన ఏకా థా టైగర్, టైగర్ జిందా హే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళను సాధించాయి.
టైగర్ చనిపోనంత వరకు, టైగర్ కి ఓటమి లేదు… #TigerSandesam #Tiger3… దీపావళి కి వస్తున్నాం.💥#Tiger3… Diwali Release🔥@BeingSalmanKhan #KatrinaKaif #ManeeshSharma @Tiger3TheFilm_ @yrf#YRF50 | #YRFSpyUniversepic.twitter.com/g0lhtZ8UHE
— Vamsi Kaka (@vamsikaka) September 27, 2023