విజయ్ ఆంటోనీ (Vijay Antony) నటించిన బిచ్చగాడు ఏ రేంజ్లో బాక్సాఫీస్ ను షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇపుడీ ప్రాజెక్ట్‌కు సీక్వెల్ బిచ్చగాడు 2 (Bichagadu 2)కూడా వస్తుందని తెలిసిందే. విజయ్ ఆంటోనీ సినిమాలకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంటుంది. తెలుగు, తమిళ భాషల్లో మంచి మార్కెట్ కూడా ఉంటుంది.
బిచ్చగాడు 2 డిజిటల్, శాటిలైట్ హక్కులకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ ను స్టార్ నెట్వర్క్ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్టు ఇండస్ట్రీ సర్కిల్ టాక్. సీక్వెల్ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీయే స్వయంగా డైరెక్ట్ చేస్తూ.. సంగీతమందిస్తుండటం విశేషం. కొన్ని నెలల క్రితం విడుదలైన బిచ్చగాడు 2 థీమ్ సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది.
బిచ్చగాడు 2లో హరీష్ పేరడి, కావ్య థాపర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మిస్తున్నారు. 2023 సమ్మర్ కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. తెలుగు,తమిళంతోపాటు పలు ప్రధాన భారతీయ భాషల్లో విడుదల కానుంది.
బిచ్చగాడు 2 థీమ్ సాంగ్..
Read Also : Vaarasudu | వారసుడు నుంచి Soul Of Vaarasudu లిరికల్ వీడియో సాంగ్
Read Also : Padmaja Raju | ప్రముఖ టాలీవుడ్ నిర్మాతకు సతీవియోగం
Read Also : HanuMan | మైండ్బ్లోయింగ్గా అండర్ వాటర్ షాట్స్.