Geethanjali | అంజలి నటించిన హారర్ సినిమా ‘గీతాంజలి’కి కొనసాగింపుగా వస్తున్న సినిమా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. శివ తుర్లపాటి దర్శకుడు. కోన వెంకట్ నిర్మాత. మార్చి 22న ఈ విడుదల కానుంది. ఈ మూవీ టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకులు మలినేని గోపీచంద్, బాబీ, బుచ్చిబాబు సాన, హీరో శ్రీవిష్ణు అతిథులుగా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
అంజలి మాట్లాడుతూ ‘ కథానాయికగా ఈ సినిమాతో 50 సినిమాలు పూర్తి చేసుకున్నందుకు ఆనందంగా ఉంది. పదేళ్ల తర్వాత మళ్లీ ఈ తరహా సినిమా చేయగలిగాం అంటే అదంతా కోన వెంకట్‌గారి చలవే.’ అన్నారు. పదేళ్ల క్రితం వచ్చిన ‘గీతాంజలి’లా ఈ సినిమా కూడా ట్రెండ్ సెట్టర్ అవుతుందని కోన వెంకట్ నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా చిత్రయూనిట్ మాట్లాడారు.