Biggboss Season 5 telugu| ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ లక్ష్యం ఒక్కటే
బిగ్ బాస్ (Biggboss House)ఇల్లు ప్రశాంతత తక్కువ..గొడవలు ఎక్కువగా ఉంటాయి. పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువగా జనాల్లోకి వెళ్తుంది అని నిర్వాహకులకు తెలియని విషయం కాదు. అందుకే ఈ షోలో ఎక్కువగా గొడవలు, మనస్పర్థలు హైలెట్ చేస్తూ ఉంటారు.

బిగ్ బాస్ (Biggboss House)ఇల్లు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ప్రశాంతత తక్కువ..గొడవలు ఎక్కువగా ఉంటాయి. పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువగా జనాల్లోకి వెళ్తుంది అని నిర్వాహకులకు తెలియని విషయం కాదు. అందుకే ఈ షోలో ఎక్కువగా గొడవలు, మనస్పర్థలు హైలెట్ చేస్తూ ఉంటారు. ఎప్పటి నుంచో ఇదే జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. రెండో రోజు అలా మొదలైంది..గొడవలు కూడా మొదలయ్యాయి. పైగా ఈసారి వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ చాలా క్లారిటీగా ఉన్నారు. గొడవలు పడితేనే మనం ప్రోమోలో పడతాము.. లేదంటే తీసి పక్కన పడేస్తారు అనే క్లారిటీ వాళ్లలో ఫుల్ గా ఉంది.
అందుకే వచ్చిన రోజు నుంచే గొడవలు పెట్టుకోవడానికి కొందరు కంటెస్టెంట్స్ సిద్ధమవుతున్నారు. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే అది బాగా అర్థమవుతుంది. టెలివిజన్ నటుడు సన్నీ (VJ Sunny), యూ ట్యూబర్ సరయు (Sarayu) , నటరాజ్ (Nataraj) మాస్టర్, యాంకర్ రవి (Anchor Ravi) ఈ బ్యాచ్ అంతా చూస్తుంటే గొడవపెట్టుకోవడానికి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినట్లు అర్థమవుతుంది. వీళ్లతో పాటు మరికొందరు కంటెస్టెంట్స్ కూడా ఎక్కువగా నెగిటివిటి వైపు అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతకు ముందు సీజన్స్ వాళ్ళు బాగా ఫాలో అవటమే కాకుండా..ఏ విషయాలు అయితే ఎక్కువగా వర్కవుట్ అయ్యాయో వాటిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని వచ్చారు ఈసారి కంటెస్టెంట్స్.
మొదటి సీజన్ నుంచి నాలుగో సీజన్ వరకు ఎక్కువగా వర్కవుట్ అయింది గొడవలు మాత్రమే. ఎక్కువగా గొడవ పెట్టుకునే వాళ్లు చివరి వరకు ఉన్నారు. ఈసారి కూడా ఇలాగే కానిచ్చేద్దాం అనుకుంటున్నారు కొందరు కంటెస్టెంట్స్. అందుకే వాళ్ళ లక్ష్యం ప్రోమోలో పడటం.. ఎపిసోడ్ లో హైలైట్ అవ్వడం. దాంతో వచ్చిన రెండో రోజే నటరాజ్ మాస్టర్, యాంకర్ రవి మధ్య గొడవ జరిగింది. అలాగే సన్నీ మిగిలిన వాళ్ళను దురుసుగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇక సరయు ఎప్పటిలాగే తనదైన స్టైల్ లో మాటల తూటాలు పేలుస్తుంది. ఇదంతా చూస్తుంటే రాబోయే రోజుల్లో బిగ్ బాస్ షో ఎంత వేడి పుట్టించబోతుందో అర్థం అవుతుంది.
ఇవి కూడా చదవండి..
Rashmika Mandanna | రష్మిక మందన్నా హింట్ ఇచ్చిందా..!
Bangarraju | బంగార్రాజు టీం ఎక్కడికెళ్లిందో తెలుసా..?
Surender Reddy: పవన్ సినిమాకు ముందు మరో సినిమా ప్లాన్ చేసిన సురేందర్ రెడ్డి ..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

