Yash | బాలీవుడ్ నుంచి రాబోతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందా అంటే అది రామాయణ (Ramayana) . నితేశ్ తివారి డైరెక్ట్ చేస్తున్న ఈ మాగ్నమ్ ఓపస్లో రణ్ బీర్ కపూర్ రాముడిపాత్రలో నటిస్తుంటే.. సీతగా సాయి పల్లవి నటిస్తోంది. కేజీఎఫ్ స్టార్ యాక్టర్ యశ్ రావణుడిగా కనిపించబోతున్నాడు. ఇటీవలే రాముడి ఇంట్రో టీజర్ నెట్టింట మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఇక మూవీ లవర్స్ ఫోకస్ అంతా యశ్ పోషిస్తున్న రావణ టీజర్ ఎప్పుడొస్తుందా అనే దానిపైనే ఉంది. ఇదిలా ఉంటే స్టార్ యాక్టర్ అయి ఉండి యశ్ రావణుడి లాంటి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడమేంటని అభిమానులు షాకయ్యారు. యశ్ ఇలాంటి పాత్రను ఒప్పుకోవడానికి కారణమిదేనంటూ హింట్ ఇచ్చేశాడు దర్శకుడు.
ఈ విషయమై ఓ ఇంటర్వ్యూలో నితేశ్ తివారి మాట్లాడుతూ.. రామాయణలో రావణుడిని భయంకరమైన విలన్గా చూపించడానికి బదులు ఆయన బలాలు, బలహీనతలు చూపించాలనుకున్నా. రావణుడిని ఒక కోణంలోనే కాకుండా మరో యాంగిల్లో ప్రజెంట్ చేయబోతున్నట్టు నితేశ్ తివారి చెప్పాడు. ఈ సినిమాలో కేవలం రావణుడి శక్తివంతమైన స్వభావాన్ని మాత్రమే చూపించడం కాదు.. ఆయన అద్భుతమైన మేధస్సు, జ్ఞానాన్ని చూస్తారు. గొప్ప యుద్ధ వీరుడిగా, సంగీత విద్వాంసుడిగా, సమర్థుడైన రాజుగా, శివుడి విధేయ భక్తుడిగా చాలా పార్వ్వాలు రావణుడిలో ఉన్నాయి.
రావణుడిని కేవలం నెగెటివ్ రోల్లో చూపించడం కంటే ఆయనలో భిన్న కోణాలను ఆవిష్కరించడం ఉత్తమని అభిప్రాయపడ్డాడు. రావణుడిలోని ఈ కోణాలన్నింటిని చూపించడం తనకు చాలా ముఖ్యమని.. ఎందుకంటే అవి ఒక గొప్ప పాఠాన్ని దాచిపెడతాయి. ఓ వ్యక్తం తన అహం, పగతో రగిలిపోతే ఆ వ్యక్తి గొప్ప గుణాలేవీ పనిరి రాకుండా పోయి, చివరికి రావణుడిలా అంతమైపోతాడని చెప్పుకొచ్చాడు.
Reservoirs | తెలంగాణలో తీవ్ర నీటి సంక్షోభం.. డెడ్ స్టోరేజ్ దిశగా తెలంగాణ జలాశయాలు
Anant Ambani | ఆధ్యాత్మిక సేవలో అంబానీ వారసుడు.. గురువాయూర్, రాజరాజేశ్వరం ఆలయాలకు రూ.18 కోట్ల సాయం!
New Shayampet | కాలుష్య కోరల్లో చెరవులు..పట్టించుకోని అధికారులు