Thiru Movie Ott | కోలీవుడ్ హీరో ధనుష్ (Dhanush)కు టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. ఈయన సినిమాలను తెలుగు ప్రేక్షకులు కూడా విపరీతంగా ఆదరిస్తుంటారు. ఇక ఈ ఏడాది సార్ (Sir) సినిమాతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. తొలి ప్రేమ ఫేం వెంకీ అట్లూరీ (Venky Atluri) ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇక ధనుష్ గత ఏడాది నటించిన ‘తిరుచిత్రంబలం’ (Thiruchitrambalam) మూవీ ఏంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ మంచి కలెక్షన్లను సాధించి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాతో ధనుష్‌కు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. అంతేకాకుండా ధనుష్‌కు వంద కోట్ల కలెక్షన్లను సాధించిన మొదటి సినిమాగా ఈ చిత్రం నిలిచింది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఓటీటీలో విడుదలైన ఇప్పటివరకు రికార్డు వ్యూస్ దక్కించుకోలేక పోయింది. దానికి కారణం.. ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సన్ నెక్స్ట్లో విడుదల అవ్వడమే. ఈ మూవీని చూద్దాం అనుకున్న సన్ నెక్స్ట్లో ఉండడంతో.. యూజర్లు ఎవరూ ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో తాజాగా ఈ మూవీ మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను వెతుక్కుంది.
Tamil film #Thiruchitrambalam (2022) by @MithranRJawahar, ft. @dhanushkraja @MenenNithya #RaashiiKhanna @priya_Bshankar @prakashraaj #Bharathiraja & #Revathi, now streaming on @PrimeVideoIN.@anirudhofficial @editor_prasanna @Lyricist_Vivek @sunpictures #KalanithiMaran pic.twitter.com/OwY7iRvzCJ
— CinemaRare (@CinemaRareIN) October 6, 2023
తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ చిత్రంతో సౌత్‌లో ధనుష్‌కు మంచి పాప్యులారిటీ వచ్చింది. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించాడు. ధనుష్‌కు జోడీగా రాశీఖన్నా, నిత్యామీనన్, ప్రియా భవాని శంకర్లు హీరోయిన్లుగా నటించారు. ప్రముఖ దర్శకుడు భారతీరాజా కీలకపాత్రలో నటించాడు. మ్యూజిక్ సెన్సేషన్ అనురుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.