‘అలలిక కదలక భయపడెలే.. క్షణక్షణమొక తల తెగి పడెలే.. ప్రళయము ఎదురుగ నిలబడెలే.. మేటి ధాటికి లోకం హడలే.. రణమున యముడిక కనపడెలే.. నువు దురుసుగ చరచకు తొడలే.. పదునుగ తెగ విరిగెను మెడలే.. రక్కసి దారుల రుధిరం పొరలే..’ పవన్‌కల్యాణ్ ‘ఓజీ’(They call him OG) సినిమాకోసం గేయ రచయిత విశ్వ రాసిన ఈ పాట శనివారం విడుదలై, క్షణక్షణానికీ పెరిగిపోతున్న వ్యూస్‌తో దూసుకుపోతున్నది. ఇందులో ‘ఓజెస్’ అనే భీకరమైన గ్యాంగ్‌స్టర్‌గా పవన్‌కల్యాణ్ కనిపించబోతున్నారు. ఆ పాత్ర వ్యక్తిత్వాన్ని అద్దం పట్టేలా.. ఓజస్ సృష్టించే బీభత్సం ఏ స్థాయిలో ఉండబోతున్నదో తెలిపేలా విశ్వ ఈ పాట రాస్తే, రోమాలు నిక్కబొడిచే బీట్తో అద్భుతంగా తమన్ స్వరపరిచారు.
తమిళ హీరో శింబు ఈ గీతాన్ని పాడటం విశేషం. రా ఇంటెన్సిటీని మిళితం చేస్తూ ఎలక్ట్రానిక్ బీట్స్‌తో సాగిన ఈ పాట అగ్ని తుఫానును తలపిస్తుందని, పవన్ అభిమానుల్ని దృష్టిలో పెట్టుకొని పానిండియా ైవిజువల్ వండర్‌గా ‘ఓజీ’ చిత్రాన్ని దర్శకుడు సుజిత్ రూపొందించారని మేకర్స్ తెలిపారు. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా.. వచ్చే నెల 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు.
ఇందులో భాగంగానే శనివారం ఈ సినిమాకు చెందిన తొలి గీతాన్ని విడుదల చేశారు. ప్రియాక మోహన్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ కీలక భూమిక పోషించారు. అర్జున్ దాస్, ప్రకాశ్‌రాజ్, శ్రియారెడ్డి కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: రవి కె.చంద్రన్, ఎడిటింగ్: నవీన్ నూలి, నిర్మాత: డీవీవీ దానయ్య. నిర్మాణం: డీవీవీ ఎంటైర్టెన్మెంట్స్.