Indian Oscar Award Winners | మరికొన్ని గంటల్లో ఆస్కార్ వేడుకలు ఘనంగా ప్రారంభం కాబోతున్నాయి. భారతీయ సినీ ప్రేక్షకులు ఈ అవార్డు ప్రధానోత్సవం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయిన నాటు నాటు పాటకు ఆస్కార్ రావాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక ఈ అవార్డులు వేడుక లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో జరుగునుంది. కాగా ఇప్పటివరకు ఇండియా నుంచి ఆస్కార్ అందుకున్న ప్రముఖులు ఎవరో ఓ లుక్కేద్దాం.
తొలి భారత ఆస్కార్ గ్రహిత:
భాను అథైయా తొలి భారత ఆస్కార్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది.1983లో విడుదలైన గాంధీ సినిమాకు గానూ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఆమె 55వ ఆస్కార్ వేడుకల్లో అవార్డు గెలుచుకుంది. మహాత్మా గాంధీ జీవిత కథ ఆధారంగా ఆ సినిమా రూపొందింది.
సత్యజిత్ రే:
భారతీయ చలన చిత్ర పరిశ్రమకు వన్నె తెచ్చిన సత్యజిత్‌రే ఆస్కార్‌ను అందుకున్నాడు. సినీ రంగానికి సత్యజిత్‌రే చేసిన విశేష సేవలను గుర్తించిన ఆస్కార్స్ 1992లో సత్యజిత్‌రేకు హానరరి అవార్డును ప్రకటించింది. అయితే అప్పుడు సత్యజిత్‌రే అనారోగ్యం కారణంతో ఆస్పత్రిలో ఉండటంతో ఆ వేడుకలకు వెళ్లలేకపోయాడు. దాంతో అకాడమీ స్వయంగా హాస్పిటల్‌కు వచ్చి ఆస్కార్‌ను అందించింది.
ఏ.ఆర్ రెహమాన్:
స్వర మాంత్రికుడు ఏ.ఆర్ రెహమాన్ ఏకంగా రెండు ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాకూ బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో రెండు అవార్డులను గెలుచుకున్నాడు. ఇలా రెండు అకాడమీ అవార్డులను గెలచుకున్న తొలి భారతీయుడిగా ఏ.ఆర్ రెహమాన్ రికార్డు సృష్టించాడు.
రసూల్ పూకుట్టి:
ఎనభై ఒకటవ ఆస్కార్ వేడుకల్లో స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు గానూ ఉత్తమ సౌండ్ మిక్సింగ్ కేటగిరీలో రూసల్ పూకుట్టి ఆస్కార్‌ను గెలిచాడు.
గుల్జర్:
దర్శకుడిగా, నిర్మాతగా, గేయ రచయితగా భారతీయ చలన చిత్ర పరిశ్రమకు విశేష సేవలందించిన గుల్జర్ 81వ ఆస్కార్ వేడుకల్లో అవార్డు గెలుచుకన్నాడు. స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాలోని జయహో పాటకు ఉత్తమ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆయన్ను ఆస్కార్ వరించింది.
గునీత్ మోన్గా:
దిల్లికి చెందిక ప్రముఖ నిర్మాత గునీత్ మోన్గా 91వ ఆస్కార్ వేడుకల్లో అవార్డు గెలుచుకుంది. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలింగ్‌గా పీరియడ్ ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్ గానూ గునీత్ ఆస్కార్‌ను గెలుచుకుంది.
ఇక 95వ ఆస్కార్ అవార్డులకు ఇండియా నుంచి ఆల్ దట్ బ్రెత్స్( బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం), ది ఎలిఫెంట్ విస్ఫరర్స్(బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం), నాటు నాటు(బెస్ట్ ఒరిజినల్ సాంగ్) విభాగాలలో నామినేట్ అయ్యాయి.