Chinna | ఈ వారం అరడజన్ సినిమాలు వచ్చాయి. అన్నీ చిన్న సినిమాలే. అందులో కనీసం కొన్ని సినిమాల పేర్లు కూడా ఆడియన్స్కు ఐడియా లేదు. కానీ ప్రమోషన్స్తో థియేటర్స్ వరకు ప్రేక్షకులను రప్పించడానికి నానా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అందులో కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా సితార ఎంటర్టైన్మెంట్స్ మ్యాడ్ (MAD) సినిమాకు అదిరిపోయే టాక్ వచ్చింది. ఈ సినిమాకు కాలేజ్ బ్యాచ్లు క్యూ కట్టడం ఖాయం అయిపోయింది.
కాలేజ్ డ్రామానే అయినా కూడా ఎక్కడా ఏ బూతులు లేకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు కళ్యాణ్ శంకర్. మందు తాగడం మినహాయిస్తే మరేం చూపించలేదు. మరోవైపు సిద్ధార్థ్ చిన్నా(Chinna) సినిమాకు చాలా మంచి టాక్ వచ్చింది. అసలు సిద్దూ కెరీర్లోనే ఇది బెస్ట్ సినిమా అంటున్నారు విమర్శకులు. కానీ డబ్బులు వచ్చే మార్గం అయితే కనిపించలేదు.
మరోవైపు మురళీధరన్ బయోపిక్ 800 (800the movie) సినిమాకు ఇదే పరిస్థితి. సినిమాపై నమ్మకంతో రెండు రోజుల ముందే ప్రీమియర్స్ వేసారు. చూసినోళ్లు కూడా బాగుందనే చెప్పారు. మురళీ జీవితాన్ని చాలా చక్కగా చూపించారనే ప్రశంసలు వచ్చాయి. అయితే కలెక్షన్ల పరంగా చూసుకుంటే మాత్రం ఈ సినిమాకు ఓపెనింగ్స్ కనిపించడం లేదు. ఇక కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర నటించిన మంత్ ఆఫ్ మధు సినిమాకు విమర్శకుల ప్రశంసలు వస్తున్నాయి కానీ కమర్షియల్గా జాడ కనిపించడం లేదు. ఈ మూడు సినిమాలకు మంచి టాక్ వచ్చినా దాన్ని కమర్షియల్గా కన్వర్ట్ చేసుకోవడంలో దర్శక నిర్మాతలు ఎంతవరకు విజయం సాధిస్తారనేది చూడాలిక.
మ్యాడ్ ట్రైలర్..
800 ట్రైలర్..
SACHIN TENDULKAR UNVEILS TRAILER OF MUTHIAH MURALIDARAN BIOPIC ‘800’… 6 OCT RELEASE… #SachinTendulkar unveiled the trailer of the #MuthiahMuralidaran biopic, titled 800 [#800TheMovie]… #SanathJayasuriya was also present at the event.
Trailer 🔗: https://t.co/e21A4LjQH2… pic.twitter.com/0zDMU3N3UH
— taran adarsh (@taran_adarsh) September 5, 2023