Manchu Vishnu | ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణును గెలిపించిన కీలక అంశాలివే
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు (Maa Elections) ఎంత వాడీవేడీగా జరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రకాష్ రాజ్ (Prakash Raj), మంచు విష్ణు (Manchu Vishnu) మధ్య పోటీ అందరూ బాగానే ఆస్వాదించారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు (Maa Elections) ఎంత వాడీవేడీగా జరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చివరి వరకు కూడా ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ అందరిలోనూ కనిపించింది. ప్రకాష్ రాజ్ (Prakash Raj), మంచు విష్ణు (Manchu Vishnu) మధ్య పోటీ అందరూ బాగానే ఆస్వాదించారు. మధ్యలో చిన్న చిన్న గొడవలు పడ్డారనే అప్రతిష్ట పక్కనపెడితే మా ఎన్నికలు బాగానే జరిగాయి. అయితే మా ఎలక్షన్స్ లో మంచు విష్ణు గెలవడానికి ఏ ఏ అంశాలు తోడ్పడ్డాయి.. దీనిపై ఇప్పుడు అందరూ ఆరా తీస్తున్నారు. విష్ణు గెలవడానికి ముఖ్యమైన కారణం ఆయన తెలుగు వాడు కావడం. దానికి తోడు మోహన్ బాబు (Mohan Babu) కుమారుడు.
ఈ రెండు అంశాలు విష్ణు గెలుపులో కీలక పాత్ర పోషించాయి. మరీ ముఖ్యంగా తనకు వ్యతిరేకంగా పోటీ చేసిన ప్రకాష్ రాజ్ ఇక్కడ ఉండడు..ఒకవేళ అధ్యక్షుడిగా గెలిపించినా కూడా మీ సమస్యలు తీర్చడానికి ఆయన ఫ్రీగా ఉండలేడు..సమయం కేటాయించలేడు అంటూ సభ్యులకు అర్థమయ్యేటట్టు చెప్పాడు మంచు విష్ణు. అన్నింటి కంటే ముందు నాన్ లోకల్ అనే విషయాన్ని బాగా సభ్యుల బుర్రలోకి ఎక్కించారు. దానికితోడు ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలు, నటులు కూడా ప్రకాష్ రాజ్ వైపు కాకుండా మంచు విష్ణు వైపు అడుగులు వేశారు. అన్నింటికీ మించి ఎన్నికలు మొదలైన తర్వాత ప్రచారంలో భాగంగా అందరిని కలుపుకుపోయాడు మంచు విష్ణు.

అప్పటివరకు తాను మాట్లాడని వాళ్లను కూడా నవ్వుతూ పలకరించాడు. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరినీ కలిసి తనకు మద్దతు తెలపాలని కోరారు. అదే సమయంలో ప్రకాష్ రాజ్ మాత్రం మద్దతు కూడగట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు. కేవలం మెగా కుటుంబాన్ని మాత్రమే నమ్ముకొని ప్రచారం చేసుకున్నాడు. అక్కడి నుంచి నాగబాబు మినహా ఎవరు బయటికి వచ్చి బాహాటంగా సపోర్ట్ చేయలేదు. ఇది ప్రధానంగా ప్రకాష్ రాజ్ ఓటమికి కారణంగా మిగిలిపోయింది. దానికితోడు అందరినీ కలుపుకుపోవడంలో ప్రకాష్ పూర్తిగా విఫలమయ్యాడు. మరీ ముఖ్యంగా కేవలం తన ప్యానల్ సభ్యుల గురించి తప్ప బయట వాళ్ల గురించి అస్సలు ఆలోచించలేదు. తాను గెలిస్తే ఏం చేస్తాను అనే విషయంపై కూడా పూర్తి క్లారిటీ ఇవ్వలేదు ప్రకాష్ రాజ్.
మరోవైపు మంచు విష్ణు మాత్రం రాజకీయ నాయకులకు ఏ మాత్రం తీసిపోకుండా మేనిఫెస్టో విడుదల చేశాడు. కేవలం మేనిఫెస్టోలో ఉన్న విషయాలు మంచు విష్ణు ఘనవిజయాన్ని తీసుకువచ్చి పెట్టాయి. సీనియర్ నరేష్ మొదటినుంచి విష్ణు పక్కనే ఉన్నాడు. ప్రతి ఒక్క సభ్యునికి వ్యక్తిగతంగా ఫోన్ చేసి మాట్లాడి తను గెలిపించ వలసిందిగా కోరాడు విష్ణు. ఎవరెన్ని విమర్శలు చేసినా కూడా నిర్భయంగా తిప్పికొట్టాడు. ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నా కూడా వారిపై గౌరవం చూపించాడు విష్ణు. అన్నింటికీ మించి మోహన్ బాబు లాంటి కొండ వెనక ఉండడంతో మా సభ్యులు కూడా పూర్తిగా విష్ణును నమ్మారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, సొంత ఇంటి కల ఇవన్నీ చేసి చూపిస్తాను అంటూ సవాల్ చేశాడు విష్ణు. ఇప్పుడు గెలిచినంత మాత్రాన సంబరాలు చేసుకోవడం కాదు. అసలు పరీక్ష ఆయనకు ముందు ముందు ఎదురుకానుంది. ఇది ఎలా ఎదుర్కొంటాడు అనేది ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి..
Chiranjeevi | మా ఎన్నికల ఫలితాలపై చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్
Divorce: విడాకులకి సిద్ధమవుతున్న మరో తెలుగు హీరో..నిజమెంత?
Tollywood | ‘మా’ ఎన్నికల పోలింగ్ లో కనిపించని తారలు వీళ్లే
Pragya Jaiswal: ప్రగ్యాకి కరోనా.. టెన్షన్లో బాలయ్య అభిమానులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

