vaishnavi chaitanya | టాలీవుడ్ యాక్టర్ ఆనంద్ దేవరకొండ (Anand deverakonda) హీరోగా నటిస్తోన్న చిత్రం బేబి (Baby). విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) మరో లీడ్ రోల్లో నటిస్తున్నాడు. హృదయ కాలేయం ఫేం సాయిరాజేశ్ (Sai Rajesh) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో వైష్ణవి చైతన్య (vaishnavi chaitanya) హీరోయిన్గా నటిస్తోంది. జులై 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది. ఇందులో భాగంగా వైష్ణవి చైతన్య మీడియాతో చిట్‌చాట్ చేసి సినిమా విశేషాలు పంచుకుంది.
ప్రతీ యాక్టర్‌కు తన శక్తిసామర్థ్యాలను నిరూపించుకునే పాత్ర ఒకటి కావాలి. బేబిలో తనది అలాంటి పాత్రేనంటోంది వైష్ణవి చైతన్య. సాయిరాజేశ్ బేబి కథ చెబుతున్నప్పుడు తాను ట్రాన్స్‌లో ఉన్నానని చెప్పింది. విలేజ్ నుంచి టౌన్ బ్యాక్ డ్రాప్ వరకు సాగే ప్రయాణానికి తగ్గట్టు మారిపోయే విద్యార్థినిగా నటించా. తమది కలర్ ఆధారంగా వ్యక్తులను వేరు చేయాలనే ఆలోచన కాదని, ప్రేక్షకులు తన క్యారెక్టర్‌తో అనుబంధంగా ఫీలవుతారని చెప్పుకొచ్చింది.
బేబి హృదయాలను కదిలించే భావోద్వేగపూరిత ప్రేమకథ. పరిస్థితులకు తగ్గట్టుగా పాత్రల స్వభావం ఎలా ఉంటుందనేది చూస్తారు. సినిమాలో హీరో ఉండడు.. ఎందుకంటే పరిస్థితులే ప్రధాన పాత్ర పోషిస్తాయి. అల వైకుంఠపురంలో, వలిమై సినిమాల్లో తన పాత్రలు చాలా చిన్నవని, సెట్స్‌లో చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పుకొచ్చింది. రాబోయే సినిమాల్లో పర్ఫార్మెన్స్ కు ఆస్కారమున్న పాత్రల్లో నటించేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తానంది వైష్ణవి చైతన్య.
బేబి టీజర్.. వీడియో
ఆనంద్ దేవర కొండ, వైష్ణవి చైతన్య మధ్య చిన్న నాటి నుంచి ఉన్న ఇష్టం కాస్తా ప్రేమగా మారడం, ఆ తర్వాత వైష్ణవి కాలేజ్ స్టడీస్ కోసం టౌన్‌కు రావడం, కాలేజీలో విరాజ్ అశ్విన్ పరిచయం కావడం.. ఆ తర్వాత ముగ్గురు మధ్య ఎలాంటి ట్రయాంగిల్ లవ్ ట్రాక్ నడిచిందనే నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు ట్రైలర్‌తో చెప్పేశాడు డైరెక్టర్. చాలా కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై ఫ్రెష్ ఫీల్ అందించేలా సాగుతున్న బేబి ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
బేబి నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన ఓ రెండు మేఘాలియా, దేవరాజా పాటలు నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ.. మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తున్నాయి. బేబి చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్కేఎన్ నిర్మిస్తున్నారు. ఆనంద్ దేవరకొండ దీంతోపాటు గమ్ గమ్ గణేశాలో కూడా నటిస్తున్నాడు.
బోనం ఎత్తిన వైష్ణవి చైతన్య..
Team #BabyTheMovie joins the Bonalu festivities, interacts with audience & seeks love & blessings 🤗#BabyTrailer ~ 𝐓𝐑𝐄𝐍𝐃𝐈𝐍𝐆 𝐓𝐎𝐏 🔝 https://t.co/TgGWl4rm4D
In theatres near you from July 14th! 💖#BabyOnJuly14th 🤩@ananddeverkonda @iamvaishnavi04 @viraj_ashwin pic.twitter.com/nihk96vtRS
— GSK Media (@GskMedia_PR) July 9, 2023
బేబి ట్రైలర్..
ప్రేమిస్తున్నా లిరికల్ వీడియో సాంగ్..
దేవరాజా లిరికల్ వీడియో సాంగ్..
ఓ రెండు మేఘాలిలా లిరికల్ వీడియో సాంగ్..